కేరళలో ఫుట్ బాల్ ప్రపంచ చాంపియన్ జట్టు మ్యాచ్.. వ్యాపారుల చందా

భారత్ లో ఫుట్ బాల్ ను ఆదరించేంది రెండే రాష్ట్రాలు. ఒకటి పశ్చిమ బెంగాల్, రెండోది కేరళ. గోవాలోనూ ఫుట్ బాల్ కు ఆదరణ ఉన్నప్పటికీ వీటి కంటే తక్కువ

Update: 2024-11-20 12:01 GMT

కేరళ ఏంటి..? అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ రావడం ఏమిటి? భారత్ వంటి దేశంలో ఫుట్ బాల్ కు అసలు ఆదరణ లేదు కదా..? తమ మ్యాచ్ లు చూసేందుకు రావాల్సిందిగా ఏకంగా భారత కెప్టెనే ఓసారి వాపోయాడు కదా..? అలాంటిది మన దేశానికి అంతర్జాతీయ ఫుట్ బాట్ స్టార్ రావడం ఏమిటి? అది కూడా పర్యటన కోసం కాకుండా ఏకంగా మ్యాచ్ ఆడేందుకు రావడం ఏమిటి..? ఇదంతా నిజమా..? కేవలం ప్రతిపాదనా? అనుకుంటున్నారా? ఇది వాస్తవమే.

అక్కడ బెంగాల్.. ఇక్కడ కేరళ

భారత్ లో ఫుట్ బాల్ ను ఆదరించేంది రెండే రాష్ట్రాలు. ఒకటి పశ్చిమ బెంగాల్, రెండోది కేరళ. గోవాలోనూ ఫుట్ బాల్ కు ఆదరణ ఉన్నప్పటికీ వీటి కంటే తక్కువ. అందుకే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎస్) వంటి ఫుట్ బాల్ లీగ్ కు కేరళ ఆతిథ్యం ఇస్తోంది. ఇక మిగత భారత దేశంలో ఫుట్ బాల్ కు ఆదరణ ఉన్నా.. భారీగా జనం హాజరయ్యే స్థాయి లేదు. కానీ, ప్రపంచ కప్ సందర్భంగా మాత్రం యావత్ భారత దేశమూ ఫుట్ బాల్ చూస్తుందనే చెప్పాలి.

మనకు అర్జెంటీనా అంటే ప్రేమ

ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా.. ప్రపంచ ఫుట్ బాల్ లో దిగ్గజాలు. అయితే, భారతీయులకు ఎందుకనో గానీ అర్జెంటీనానే అంటే ప్రేమ ఎక్కువ. సరిగ్గా రెండేళ్ల కిందట జరిగిన ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారతీయులు ఫ్రాన్స్ కంటే అర్జెంటీనానే సపోర్ట్ చేశారు. అర్జెంటీనా గెలిస్తే భారత్ కప్ గెలిచినంత సంబరపడ్డారు. ఇక ఈ మ్యాచ్ లో అర్జెంటీనా కెప్టెన్ లయోనల్ మెస్సీ విన్యాసాలను చూసి అబ్బురపడ్డారు. అలాంటి మెస్సీ భారత్ కు వచ్చి మ్యాచ్ ఆడుతున్నాడు.

వచ్చే ఏడాది కేరళలో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం మెస్సీ వస్తున్నాడు . అంతేకాదు.. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా ఫుట్ బాట్‌ జట్టు కూడా అతడితో పాటు రానుందట. ఈ విషయాన్ని కేరళ క్రీడా శాఖ మంత్రి వి.అబ్దురహిమన్‌ బుధవారం వెల్లడించారు. చాలాకాలంగా మెస్సీ ఈ మ్యాచ్‌ కోసం కేరళ వస్తున్నాడనే కథనాలు వస్తున్నా.. మంత్రి ప్రకటనతో నిర్ధారణ అయింది. ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే, ప్రపంచ చాంపియన్ జట్టు పాల్గొనే హై ప్రొఫైల్ మ్యాచ్ మ్యాచ్ కాబట్టి నిర్వహణకు ఆర్థికసాయాన్ని రాష్ట్ర వ్యాపారులు అందిస్తారని తెలిపారు.

Tags:    

Similar News