70 వేల కోట్ల ఆస్తి.. 27 ఏళ్లకే క్రికెటర్ రిటైర్

ఒకప్పుడు భారత దేశంలో సంపన్నులు అంటే టాటాలు, బిర్లాలు అని చెప్పేవారు.

Update: 2024-08-03 19:30 GMT

రోహిత్ శర్మ ఆర్థిక కష్టాల గురించి.. కోహ్లి తండ్రిని కోల్పోయిన పరిస్థితి నుంచి.. జైశ్వాల్ యూపీ నుంచి ముంబై వచ్చి ఎదుర్కొన్న అనుభవాల గురించి.. ఇలా భారత క్రికెటర్లలో అందరి నేపథ్యమూ అభిమానులకు తెలుసు. అయితే, వీరంతా దిగువ మధ్యతరగతి నుంచి వచ్చారు. అజయ్ జడేజా వంటి ఒకరిద్దరు తప్ప బాగా సంపన్న నేపథ్యం నుంచి వచ్చినవారు చాలా తక్కువ. అయితే, ఒక్క క్రికెటర్ మాత్రం ఆగర్భ శ్రీమంతుడు. కావాలంటే ఓ పది స్టేడియాలు కట్టగలవాడు. కానీ, క్రికెట్ పై మక్కువతో కెరీర్ గా ఎంచుకున్నాడు.

బిర్లాల బాబు

ఒకప్పుడు భారత దేశంలో సంపన్నులు అంటే టాటాలు, బిర్లాలు అని చెప్పేవారు. అలాంటి బిర్లాల కుటుంబం నుంచి వచ్చినవాడు ఆర్యమాన్ బిర్లా. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) సంస్థ వీరికి ఉన్న వాటిలో ఒకటి. ఈ సంస్థకు నిరుడు డైరెక్టర్ గానూ ఆర్యమాన్ నియమితుడయ్యాడు. కాగా, ఈయన తండ్రి ఎవరో కాదు.. కుమార మంగళం బిర్లా.

రూ.70 వేల కోట్ల ఆస్తిపరుడు

కుమార మంగళం బిర్లా ఆస్తి రూ.70 వేల కోట్లు. ఈయన వారసుడే ఆర్యమాన్. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న ఆర్యమాన్ గతంలో ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికయ్యాడు. కానీ, రెండేళ్లుగా ఆ జట్టుతో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అప్పట్లో ఆర్యమాన్ ఖరీదు ఎంతో తెలుసా.. రూ.లక్షల్లోనే. అంటే వేల కోట్ల అధిపతికి చిల్లరతో సమానమైన మొత్తం అన్నమాట.

కాగా, 27 ఏళ్ల ఆర్యమాన్ ఎడమచేతివాటం బ్యాట్స్ మన్. పుట్టి పెరిగింది ముంబై అయినప్పటికీ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కు ఆడాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఒక సెంచరీ (103 నాటౌట్) సహా 414 పరుగులు చేశాడు. తాజాగా ఆర్యమాన్ తన క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. బహుశా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన వ్యాపారంపై తన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News