ఓచేత్తో కప్పు.. మరోచేత్తో లవర్.. ఓ అందమైన మహిళా క్రికెటర్
క్రీజులో ఆమె ఉంటే జట్టుకు గెలుపు ఖాయం అనేంతగా రాణిస్తోంది. ఈసారి తమ జట్టుకు లీగ్ టైటిల్ ను అందించింది
ఆమె పొరపాటున క్రికెట్ లోకి వచ్చిందేమో..? సినిమాల్లో ఉండి ఉంటే సూపర్ హీరోయిన్ అయ్యేది.. ఆమె అందంలో సగం కూడా లేని వారు హీరోయిన్లుగా దున్నేస్తుంటే ఇదే అనిపిస్తుంది. అయితే, క్రికెటర్ గానూ ఆమె దేశం కోసం చాలా కష్టపడుతోంది. నంబర్ వన్ బ్యాటర్ గా దుమ్ము రేపుంతోంది. క్రీజులో ఆమె ఉంటే జట్టుకు గెలుపు ఖాయం అనేంతగా రాణిస్తోంది. ఈసారి తమ జట్టుకు లీగ్ టైటిల్ ను అందించింది.
‘ఈ సాలా కప్ నమదే..’
పురుషుల ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండీ.. విరాట్ కోహ్లి లాంటి దిగ్గజం 16 సీజన్లుగా జట్టులోనే ఉన్నప్పటికీ టైటిల్ కొట్టలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కానీ, అదే రాయల్ ఛాలెంజర్స్ ఆదివారం కప్ సాధించింది. అదెలాగంటే.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ద్వారా. ఆదివారం ముగిసిన లీగ్ రెండో సీజన్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమ్మాయిల జట్టు చాంపియన్ గా నిలిచింది. ‘ఈ సాలా కప్ నమదే (ఈ సారి కప్ మాదే)’ అంటూ ప్రతిసారి బరిలో దిగడం.. ఉత్త చేతులతో వెనుదిరగడం పురుషుల జట్టుకు పరిపాటిగా మారింది. కానీ ఇప్పుడు ఆర్సీబీ మహిళలు ట్రోఫీ కొట్టేశారు. దిగ్గజాలు, స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఆర్సీబీ పురుషుల జట్టుకు ఆడారు. 2009, 2011, 2016లో ఫైనల్లో బోల్తాపడింది. ఇక, నిరుడు స్మృతి మంధాన సారథ్యంలో డబ్ల్యూపీఎల్ లో అడుగుపెట్టిన ఆర్సీబీ కూడా 8 మ్యాచ్ లలో రెండు విజయాలే నమోదు చేసింది. దీంతో మహిళల జట్టులోనూ ఆర్సీబీ ఇంతేనేమో అనిపించింది.
ఒడిదొడుకులు ఎదురైనా..
ఈ సీజన్ లోనూ ఒడిదొడుకులతో సాగింది ఆర్సీబీ మహిళల జట్టు. ముంబై గెలిచి ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. ఎలిమినేటర్ లోనూ అదే ముంబైని మట్టికరిపించింది. సవాళ్లను దాటి ఫైనల్ చేరిన తొలిసారే.. ఢిల్లీని ఓడించి ఛాంపియన్ గా నిలిచిది. వాస్తవం ఏమంటే.. ఈ మ్యాచ్ కు ముందు వరకు ఢిల్లీపై ఆర్సీబీ గెలిచిందే లేదు.
విరాట్ వీడియో కాల్..
ఆర్సీబీ పురుషుల జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ అనంతరం మహిళల జట్టుకు వీడియో కాల్ చేశాడు. కెప్టెన్ స్మృతి మంధానతో మాట్లాడాడు. అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టా స్టోరీస్ లోనూ ‘సూపర్ వుమెన్’ అంటూ జట్టు ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.
నీ ప్రియుడెవరో తెలిసిందిలే..
డబ్ల్యూపీఎల్ టైటిల్ కొట్టిన అనంతరం ఓవైపు టైటిల్, మరోవైపు ప్రియుడితో కలిసి ఆర్సీబీ కెప్టెన్ మంధాన ఫొటోలకు పోచ్చింది. మంధాన కొంతకాలంగా పలాస్ ముచ్చల్ తో ప్రేమలో ఉంది. పలాస్.. బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్. ఓ ఈవెంట్ లో వీరిద్దరికీ పరిచయమైంది. అది చివరకు ప్రేమగా మారింది.