చేతులు మారనున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ.. భారతీయ కంపెనీకే పగ్గాలు

ఆడింది మూడు సీజన్లు.. ఇందులో తొలి సీజన్ లోనే విజేతగా ఆవిర్భావం.. రెండో సీజన్ లో త్రుటిలో టైటిల్ లాస్.. మూడో సీజన్ లో కెప్టెన్ మార్పుతో కాస్త ఇబ్బంది పడి వెనుకంజ.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆ ఫ్రాంచైజీ ప్రస్థానం.

Update: 2025-02-11 08:20 GMT

ఆడింది మూడు సీజన్లు.. ఇందులో తొలి సీజన్ లోనే విజేతగా ఆవిర్భావం.. రెండో సీజన్ లో త్రుటిలో టైటిల్ లాస్.. మూడో సీజన్ లో కెప్టెన్ మార్పుతో కాస్త ఇబ్బంది పడి వెనుకంజ.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆ ఫ్రాంచైజీ ప్రస్థానం. మరొక్క 40 రోజుల్లో టోర్నీ 18వ ఎడిషన్ ప్రారంభం కానుండగా అనూహ్యంగా ఫ్రాంచైజీ చైతులు మారింది.

ఐపీఎల్ లో మూడే సీజన్లు ఆడినా.. గుజరాత్ టైటాన్స్ (జీటీ) మంచి జట్టుగా గుర్తింపు పొందింది. పోలిక అనవసరం కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కంటే మెరుగైన టీమ్ గుజరాత్ టైటాన్స్. 2022 సీజన్ లో అడుగుపెట్టిన మొదటి ఏడాదే విజేతగా నిలిచింది. 2023లో రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈ రెండుసార్లు టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే కెప్టెన్. 2024లో మాత్రం గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ఒడిదొడుకులతో సాగింది.

మినీ వేలంలో హార్దిక్ ను తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తీసేసుకోవడంతో గుజరాత్ మీద దెబ్బపడింది. హార్దిక్ దూరం కావడంతో జీటీ పగ్గాలను యువ బ్యాట్స్ మన్ శుబ్ మన్ గిల్ కు అప్పగించారు. అయితే, హార్దిక్ వంటి ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేవారు లేక జట్టులో సమతుల్యం లోపించింది. దీని ప్రభావం జట్టు విజయాలపై పడింది.

వచ్చే నెల 14 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ కొత్త సీజన్ కు ముందే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఓనర్ షిప్ మారనుంది.

ప్రస్తుతం లగ్జెంబర్గ్ కు చెందిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ ఆధీనంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను టొరెంట్ గ్రూప్ దక్కించుకోనుంది. 67 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. టొరెంట్ గ్రూప్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సంస్థనే కావడం విశేషం. దీనిని ఉత్తమ్ భాయ్ నాథ్ లాల్ మెహతా స్థాపించారు. ఆయన కుమారులు సుధీర్, సమీర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, విద్యుత్తు రంగ వ్యాపారాల్లో ఉన్న టొరెంట్ గ్రూప్ కు నిరుడు సెప్టెంబరు నాటికే 25 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది.

Tags:    

Similar News