టీమిండియా హెడ్ కోచ్ గా ధోనీ.. ఇది అసలు సాధ్యమా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ నుంచి కోచ్ కావలెను అనే ప్రకటన విడుదలైతే ఎవరైనా ఎగిరి గంతేస్తారు

Update: 2024-05-31 10:56 GMT

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ నుంచి కోచ్ కావలెను అనే ప్రకటన విడుదలైతే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కనీసం ఏడాదికి రూ.5 కోట్ల జీతభత్యాలు.. అంతకుమించిన గౌరవ మర్యాదలు.. అయితే, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ పదవి దాదాపు ఖాళీ అనే భావించాలి. దీనికోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ ల పేర్లు మొదట్లో వినిపించాయి. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు వీరిద్దరూ మెంటార్లుగా ఉన్నారు. దీంతో తాము భారత కోచ్ గా ఉద్దేశం లేదని చెప్పేశారు. వాస్తవానికి వీరిద్దరిలో పాంటింగ్ కోచ్ గా రావడం భారత అభిమానులకూ పెద్దగా ఆసక్తి ఉండదేమో?

గంభీర్ వస్తాడా? రాడా?

టీమిండియా హెడ్ కోచ్ పదవికి గత సోమవారంతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసినవారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. అయితే, మాజీ ఓపెనర్, కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ మెంటార్ గౌతమ్ గంభీర్ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి గంభీర్ దరఖాస్తు చేయలేదనే సమాచారం. కానీ, అతడి క్రికెట్ నైపుణ్యం రీత్యా ప్రముఖంగా ముందుకొచ్చింది. అయితే, గంభీర్ నుంచి కానీ.. బీసీసీఐ తరఫున కానీ దీనిపై ప్రకటన అయితే వెలువడలేదు.

మరి ధోనీకి చాన్సుందా?

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గానూ అతడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐదు టైటిల్స్ అందించిన ధోనీ.. 42 ఏళ్ల వయసులోనూ ఈ సీజన్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్సీని వదిలేసినా.. మైదానంలో మాత్రం అతడి సలహాలు విలువైనవని చెప్పక తప్పదు. వచ్చే సీజన్ కు మాత్రం అందుబాటులో ఉంటాడో లేడో కానీ.. అతడు ఆడతానంటే మాత్రం కాదనరు.

అయితే, టీమిండియా హెడ్ కోచ్ గా ధోనీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. గంభీర్ ప్రతిభావంతుడే అయినా.. అతడి ముక్కుసూటితనం, స్టార్ బ్యాటర్ కోహ్లితో విభేదాల రీత్యా అభ్యంతరాలు వ్యక్తం అయ్యే చాన్సుంది. అదే ధోనీని మాత్రం ఎవరూ కాదనలేరు. కాగా.. ధోనీకి భారత హెడ్ కోచ్ గా వచ్చేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అతడు ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడు కావడమే దీనికి కారణం. మరోవైపు ధోనీ 2021 టి20 ప్రపంచ కప్ సందర్భంగా టీమిండియా మెంటార్ గా వ్యవహరించాడు. ఆ కప్ లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది.

అడ్డంకులు లేకుంటే..

టీమిండియా హెడ్ కోచ్ గా ధోనీకి మించిన అర్హతలు మరెవరికీ లేవు. కెప్టెన్ కూల్ గా అతడు ఎంతటి ఘనతలు సాధించాడో అందరికీ తెలుసు. చెన్నైతో బంధం తెంచుకుని.. హెడ్ కోచ్ గా రావాలని అభిలషిస్తే ధోనీకి అడ్డే ఉండదు. అయితే, అన్నిటికి మించి అతడు ఆసక్తిగా ఉన్నాడా? లేదా? అనేదే..

Tags:    

Similar News