ప్రపంచ విజేత.. కానీ తేడా.. ఎంతలా అంటే నమ్మలేరంతే!

అది ప్రపంచ కప్ కావొచ్చు.. ఒలింపిక్స్ కావొచ్చు.. టోర్నీ ఏదైనా.. అతను అడుగు పెడితే విజేతగా నిలవటమే. అతని ధాటికి ఎవరూ నిలవలేరు

Update: 2023-08-26 12:29 GMT

తినే కొద్దీ గారెలు సైతం చేదుగా మారుతాయంటారు. ఇప్పుడు చెప్పే విశ్వవిజేత వ్యవహారం కూడా అంతే. టోర్నీ ఏదైనా.. వెళ్లాడా.. విజేతగా తిరిగి రావటమే తప్పించి.. మరో మాటకు అవకాశం ఉండదు. విశ్వ విజేతగా ప్రపంచ చదరంగాన్ని ఏలుతున్న మహారాజు కార్లసన్. చదరంగంలో ఇతడెంత మొనగాడన్న విషయాన్ని చెప్పేందుకు రెండు.. మూడు ఉదాహరణలు సరిపోతాయి.

అది ప్రపంచ కప్ కావొచ్చు.. ఒలింపిక్స్ కావొచ్చు.. టోర్నీ ఏదైనా.. అతను అడుగు పెడితే విజేతగా నిలవటమే. అతని ధాటికి ఎవరూ నిలవలేరు. అది కూడా ఏడాది.. రెండేళ్లు.. ఐదేళ్లు కూడా కాదు దాదాపు పదేళ్లకు పైనే ప్రపంచ చదరంగాన్ని ఏలుగుతున్నారు. 13 ఏళ్లకే కొర్పోవ్.. కాస్పరోవ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను ఓడించిన ఘనత.. తర్వాతి కాలంలో విశ్వవిజేత విశ్వనాధ్ ఆనంద్ ను ఓడించిన ఘనత అతడి సొంతం. 18 ఏళ్ల వయసులోనే 2800 ఎలో రేటింగ్ ను అందుకొని.. 19 ఏళ్లకే ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన రికార్డు అతడి సొంతం.

ముఫ్పై రెండేళ్ల వయసున్న కార్లసన్.. వరుస పెట్టి విజయాల్ని సొంతం చేసుకున్నాడు. 2014, 2016, 2018, 2022 లల్లో ఒకేసారి ప్రపంచ క్లాసికల్.. ర్యాపిడ్.. బ్లిట్జ్ ఛాంపియన్ గా నిలిచిన అతగాడు.. తాజాగా ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. తన ఆటతీరుతో తన దేశమైన నార్వేలో చెస్ విప్లవానికి తెర తీశాడు. ఈసారి ప్రపంచ ఛాంపియన్ టైటిల్ ఫైనల్ పోరులో 18ఏళ్ల భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందతో తలపడ్డాడు. అంతిమంగా విజేతగా నిలిచినప్పటికీ.. ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ప్రజ్ఞానంద మ్యాచ్ టైంలో.. ఆట ప్రారంభంలో తన ఎత్తు వేయటానికి కార్లసన్ కొంత టైం తీసుకున్నాడు. దీనికి కారణం అతను చెబుతూ.. ప్రజ్ఞానంద ఎత్తుకు తన దగ్గర సమాధానం లేదని.. దానికి తాను ప్రిపేర్ కాలేదంటూ అతడ్ని మెచ్చుకున్నాడు. చివరకు ఆటలో పైచేయి సాధించినప్పటికీ.. కార్లసన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక.. కార్లసన్ విషయానికి వస్తే.. వరుస పెట్టి విజయాలు సాధించటం అతడికి బోర్ కొట్టేశాయంటున్నారు.

అందుకే.. బ్రేక్ కావాలనుకుంటున్న ఆయన ఇకపై కొన్ని టోర్నీలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం సంచలనంగా మారింది. తిరుగులేని ప్రదర్శనలతో విజేతగా నిలుస్తున్న వేళ.. మరింత దూకుడుగా దూసుకెళ్లే ఆటగాళ్లను చూస్తుంటాం. కానీ.. కార్లసన్ అందుకు భిన్నం. వరుస విజయాలతో బోర్ కొట్టిందని.. అందుకే తనకు తాను బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయిన తీరు చూసినప్పుడు.. ప్రపంచ చెస్ విజేత అయినప్పటికీ.. కాస్తంత తేడా కేసుగా అభివర్ణిస్తుంటారు. వరుస పెట్టి విశ్వవిజేతగా నిలిచిన వ్యక్తికి ఆ మాత్రం ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పండి.

Tags:    

Similar News