బిగ్ బాస్ 8 : 105 రోజుల నిరీక్షణ.. విన్నర్ ఎవరంటే..?
బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగుస్తుంది. కొద్దిసేపటి క్రితమే గ్లోబల్ స్టార్ రాం చరణ్ సీజన్ 8 విజేతని ప్రకటించారు.
బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగుస్తుంది. కొద్దిసేపటి క్రితమే గ్లోబల్ స్టార్ రాం చరణ్ సీజన్ 8 విజేతని ప్రకటించారు. అంతకుముందు అన్ని సీజన్లలో టైటిల్ విన్నర్ ఎవరన్నది ఒకరోజు ముందే లీక్ అయ్యేది. కానీ ఈసారి షో టైం దాకా చాలా సీక్రెట్ గా విన్నర్ ఎవరన్నది బయటకు రాలేదు. ఐతే ఇంకా ఇప్పటిదాకా షూట్ జరగలేదా లేదా లీక్స్ రాకుండా జాగ్రత్త పడ్డారా అన్నది తెలియదు కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రేంజ్ లో సీజన్ 8 విన్నర్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు బిగ్ బాస్ ఆడియన్స్.
ఈ సీజన్ లో ముందు నుంచి ఉన్న నిఖిల్, వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం ఇద్దరి మధ్య పోటా పోటీ ఏర్పడింది. టాప్ 2 లో ఇద్దరికీ నువ్వా నేనా అన్న రేంజ్ లో ఓట్స్ పడ్డాయి. ఐతే ఫైనల్ గా ఆడియన్స్ నిఖిల్ నే టైటిల్ విన్నర్ చేశారు.
నిఖిల్ మొదటి వారం నుంచి తన దూకుడు ఆటతో ఆడియన్స్ ని తన ఫాలోవర్స్ గా చేసుకున్నాడు. మధ్యలో కొంత గ్రాఫ్ పడ్డా కూడా మళ్లీ పుంజుకున్నాడు. ఎవరెన్ని మాటలు అన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఆట ఆడుతూ వచ్చాడు. హౌస్ లో తన ఆట తీరు మీద కొందరు కావాలని కార్నర్ చేస్తూ మాట్లాడినా వాటిని ఓపికగా సహిస్తూ వచ్చాడు.
కన్నడ నటుడైన నిఖిల్ తెలుగు బిగ్ బాస్ కి వచ్చి విన్నర్ గా అవ్వడం గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. ఐతే గౌతం కూడా నిఖిల్ కి టఫ్ ఫైట్ ఇచ్చాడు. నిఖిల్ ముందు నుంచి ఉండటం మధ్యలో గ్రాఫ్ పడ్డా మళ్లీ తన ఆటని పెంచుకోవడం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నిఖిల్ ని విజేతగా నిలబెట్టాయి. చివరి వరకు ఉత్కంఠత తో సాగిన ఈ సీజన్ విన్నర్ ని సీక్రెట్ గా ఉంచారు.
గౌతం కి కూడా విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నా కూడా నిఖిల్ మొదటి నుంచి హౌస్ లో ఉన్నాడు. టాస్కుల్లో అతను టాప్ గా నిలుస్తూ వచ్చాడు కాబట్టి అతనికే ఆడియన్స్ అందరు గెలిచెందుకు ఓటేశారని తెలుస్తుంది. టాప్ 2 లో ఉన్న ఇద్దరికీ ప్రైజ్ మనీ ఇచ్చి కన్విన్స్ చేయాలని చూసినా ఇద్దరు మేము ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే అది రిజల్ట్ ఏదైనా రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. అందుకే సీజన్ 8 విన్నర్ కి ప్రైజ్ మనీ మొత్తం తో పాటుగా సుజుకి బ్రీజా కారుని కూడా గిఫ్ట్ గా అందిస్తున్నారు.