19 ఏళ్ల బ్లాక్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి..!

బ్లాక్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. బ్లాక్ సినిమా లో రాణీ ముఖర్జీ అంధు రాలు.. అమితాబ్ బచ్చన్ కు అల్జీమర్స్ అదే మతిమరుపు వ్యాధి ఉంటుంది.

Update: 2024-02-05 02:45 GMT

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ లిస్ట్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో ఒక సినిమా బ్లాక్. అమితాబ్ బచ్చన్, రాణీముఖర్జీ కలిసి నటించిన ఈ సినిమా 2005 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంజయ్ లీల భన్సాలి సినిమాల్లో ఒక పక్క సినిమా కమర్షియల్ గా అనిపిస్తూనే ఎమోషనల్ గా ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి.

బ్లాక్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. బ్లాక్ సినిమా లో రాణీ ముఖర్జీ అంధు రాలు.. అమితాబ్ బచ్చన్ కు అల్జీమర్స్ అదే మతిమరుపు వ్యాధి ఉంటుంది. వారిద్దరి మధ్య లవ్ డ్రామా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడమే కాకుండా 3 నేషనల్ అవార్డులను అందుకుంది.

మంచి ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన బ్లాక్ సినిమా ఇప్పటివరకు ఏ డిజిటల్ ఫ్లాట్ ఫాం లో అందుబాటులో లేదు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన నెట్ ఫ్లిక్స్ ఆ సినిమా రైట్స్ కొనేసి రిలీజ్ చేశారు. నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ సినిమా అందుబాటులో ఉంటుందని నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయం విని సంతోషిస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమా రిలీజైతే చూడాలని ఎంతోమంది కోరుకున్నారు. ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ వారి కల నెరవేర్చింది.

వీకెండ్ రిలీజ్ సినిమాలే కాదు ఫ్రీ టైం లో డిజిటల్ లో అందుబాటులో ఉన్న పాత సినిమాలను కూడా ఓ లుక్కేస్తుంటారు ఆడియన్స్. ముఖ్యంగా డిజిటల్ సబ్ స్క్రైబర్స్ ఒకప్పటి ఓల్డ్ క్లాసికల్ మూవీస్ చూసేందుకు ఇష్టపడతారు. అందుకే వాటిని కూడా ఈమధ్య ఓటీటీలు పోటీ పడి మరి హక్కులు సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీ వచ్చాక అలాంటి ఓల్డ్ క్లాసిక్ సినిమాల వాల్యూ చాలా పెరిగిందని చెప్పొచ్చు. బాలీవుడ్ క్లాసిక్స్ తో పాటుగా సౌత్ లో ముఖ్యంగా తెలుగులో బ్లాక్ అండ్ వైట్ నుంచి 80, 90వ దశకంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.




 


Tags:    

Similar News