ఈవారం ఓటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

మొత్తానికి ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీస్లో మొత్తం కలిపి 23 వరకు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Update: 2024-10-10 07:10 GMT

వీకెండ్ వస్తుంది అంటే మూవీ లవర్స్ కి సందడే సందడి.. పైగా ఈసారి వచ్చేది పండగల వీకెండ్.. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మొత్తం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ కోసం సిద్ధమవుతున్నాయి. మరైతే ఈ వారం మిమ్మల్ని ఓటీటీ లో అలరించబోయే సినిమాలు, వెబ్ సిరీస్ల లిస్టు చూసేద్దామా…

అమెజాన్ ప్రైమ్:

స్త్రీ 2: రీసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్గా నిలవడంతో పాటు ఆల్ టైం అత్యధిక వసూలు సాధించిన మూవీగా గుర్తింపు తెచ్చుకున్న స్త్రీ 2 చిత్రం ఆన్లైన్ మూవీ లవర్స్ కోసం వచ్చేసింది. ఈ హారర్ కామెడీ చిత్రం ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మూవీకి సంబంధించిన హిందీ వర్షన్ మాత్రమే విడుదల కాక మిగిలిన భాషను త్వరలో స్ట్రీమింగ్ అయ్యే ఆస్కారం ఉంది.

అలాగే గుటర్ గూ సీజన్ 2 అనే హిందీ సిరీస్, సిటాడెల్: డయానా అనే ఇటాలియన్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయి.

నెట్‌ఫ్లిక్స్ :

అక్టోబర్ 10: మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్ మూవీ)

గర్ల్ హాంట్స్ బాయ్ (ఇంగ్లీష్ మూవీ), ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)

అక్టోబర్ 11:

లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్ చిత్రం), అప్ రైజింగ్ (కొరియన్ సినిమా),ది గ్రేట్ ఇండియన్ కపిల్ న్యూ ఎపిసోడ్ (హిందీ కామెడీ టాక్ షో)

ఆహా

అక్టోబర్ 10: గొర్రె పురాణం (తెలుగు మూవీ)

అక్టోబర్ 11: లెవెల్ క్రాస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

అక్టోబర్ 11: సర్ఫిరా (హిందీ సినిమా),వాళై (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)

సోనీ లివ్

అక్టోబర్ 11: జై మహేంద్రన్ (మలయాళ చిత్రం),

రాత్ జవాన్ హై (హిందీ వెబ్ సిరీస్)

జియో సినిమా ఓటీటీ

అక్టోబర్ 11: గుటర్ గూ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్), టీకప్ (ఇంగ్లీష్ మూవీ),శబరి (తెలుగు చిత్రం) ,డిస్‌క్లైమర్ (ఇంగ్లీష్ సినిమా)

మొత్తానికి ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీస్లో మొత్తం కలిపి 23 వరకు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో తెలుగు నుంచి గొర్రె పురాణం, శబరి ఉండగా తెలుగు డబ్బింగ్ మలయాళీ సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్, హిందీ చిత్రం సర్ఫిరా చిత్రాలు..తమిళ ఫీల్ గుడ్ మూవీ వాళై,సిడాటెల్ డయానా ఎక్కువగా చూడడానికి ఓటీటీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారని టాక్.

Tags:    

Similar News