ఓటీటీ స్టఫ్.. ఒకేరోజు నాలుగు క్రేజీ సినిమాలు
స్టార్ హీరోల చిత్రాలకి అయితే పెట్టిన పెట్టుబడిలో 50 శాతం డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేస్తున్నాయి.
డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. వెబ్ సిరీస్ లు, సినిమాలని ఇంట్లో ఉండి ఓటీటీలో చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా భారీ ధరలు చెల్లించి సినిమాలకి సంబందించిన ఓటీటీ హక్కులని సొంతం చేసుకుంటున్నాయి. హీరో రేంజ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ సినిమాకి ఓటీటీ రైట్స్ రూపంలో అంత పెద్ద మొత్తం నిర్మాతలకి వస్తాయి.
స్టార్ హీరోల చిత్రాలకి అయితే పెట్టిన పెట్టుబడిలో 50 శాతం డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేస్తున్నాయి. అంతలా డిజిటల్ మాధ్యమాలకి డిమాండ్ పెరిగింది. పబ్లిక్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఓటీటీ ఛానల్స్ కూడా ప్రతివారం కొత్త కంటెంట్ ని ప్రేక్షకులకి అందిస్తున్నాయి. అలా ఈ వారం చూసుకుంటే సంక్రాంతి ఫెస్టివల్ కి వచ్చిన సినిమాలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి భాగానే ఆదరణ వస్తోంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3న రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 9న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రానికి థియేటర్స్ లో మిశ్రమ స్పందన వచ్చింది. ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి ఓటీటీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ధనుష్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మూడు భాగాలుగా కెప్టెన్ మిల్లర్ తీయాలని అనుకున్న డైరెక్టర్ కి మొదటి సినిమాని నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో సీక్వెల్ కి ఫుల్ స్టాప్ పడినట్లే. ఓటీటీలో ఆడియన్స్ ని ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.
శివకార్తికేయాన్ అయలాన్ మూవీ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ గా ఓటీటీలో మూవీని స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కన్నడంలో దర్శన్ హీరోగా తెరకెక్కిన కతేరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ జీ5లో ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.