ఓటీటీ కొత్త ఆదాయ మార్గం.. ప్రేక్షకులకు చుక్కలే!

కంటెంట్ ను బట్టి యాడ్ స్ట్రీమింగ్‌ ఉంటుంది.. అదే విధంగా రేటు కూడా ఉంటుందని తెలుస్తోంది.

Update: 2023-07-17 09:24 GMT

టీవీ లో లేదా యూట్యూబ్ లో సినిమాలు.. ఇతర కంటెంట్ చూసిన సమయం లో చాలా సార్లు యాడ్స్ తో విసిగి ఉంటాం. యాడ్స్ తో విసిగి పోయిన వారికి పోటీటీ పెద్ద ఊరట. యాడ్స్ లేకుండా చూడాలి అనుకున్నది చూడవచ్చు. ఒకటి రెండు ఓటీటీ లు మినహా ఇతర ఓటీటీ లు కమర్షియల్ యాడ్స్ ను స్ట్రీమింగ్ చేయడం లేదు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లోని కంటెంట్ కి మాత్రమే యాడ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఎంపిక చేసుకున్న ప్లాన్ ను బట్టి అంటూ వార్ డిజైన్ చేయడం జరిగింది. ఓటీటీ వారు అంతా కూడా కొత్త ఆదాయ మార్గం అంటూ యాడ్స్ ను చూపించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ముందు ముందు అన్నీ ఓటీటీ లు యాడ్స్ ను చూపించబోతున్నాయట.

ప్రస్తుతానికి కొన్ని ఓటీటీ లు మాత్రమే యాడ్స్ ను స్ట్రీమింగ్‌ చేస్తూ ఉండగా ముందు ముందు మరిన్ని ఓటీటీ లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను యాడ్స్ ను కంటెంట్ మధ్య లో స్ట్రీమింగ్ చేయాల ని నిర్ణయించుకున్నారట. కంటెంట్ ను బట్టి యాడ్ స్ట్రీమింగ్‌ ఉంటుంది.. అదే విధంగా రేటు కూడా ఉంటుందని తెలుస్తోంది.

మొత్తాని కి ఓటీటీ లు కొత్త ఆదాయ మార్గాన్ని ఎంపిక చేసుకుని యాడ్స్ ను స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించుకోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్క్రిప్షన్ పేరుతో భారీ మొత్తం లో డబ్బులు వసూళ్లు చేస్తున్న ఓటీటీ లు ఇప్పుడు యాడ్స్ చూపించి చిరాకు పెట్టించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రేక్షకులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News