ఈ వారం థియేటర్​/ఓటీటీలో 15 సినిమాలు.. మీరు ఏం చూస్తారు?

అయితే ఈ సారి కూడా అన్ని చిత్రాలే బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు ఇంట్రెస్టింగ్ మూవీస్​ స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి.

Update: 2023-07-17 09:35 GMT

ప్రతివారం లాగే ఈ వారం కూడా పలు చిత్రాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. అయితే ఈ సారి కూడా అన్ని చిత్రాలే బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు ఇంట్రెస్టింగ్ మూవీస్​ స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి.

చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'. యష్‌ రంగినేని నిర్మాత. 1990లలలో జరిగే కథతో దీన్ని రూపొందించారు. జులై 21న ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్​గా 'బిచ్చగాడు-2' చిత్రంతో సూపర్​ హిట్​ అందుకున్న విజయ్‌ ఆంటోని నటించిన కొత్త చిత్రం హత్య. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్​గా నటించారు. ఈ నెల 21న చిత్ర రిలీజ్ కానుంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఇది రానుంది.

అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్‌బాబు, నందిత శ్వేత కలిసి నటించిన చిత్రం హిడింబ. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా జులై 20న రిలీజ్ కానుంది. ఇండియన్ సినిమాల్లో ఇదివరకు ఎప్పుడూ స్పృశించని ఓ డిఫరెంట్ స్టోరీతో, థ్రిల్లింగ్‌ అంశాలతో ఇది రానుందని మూవీటీమ్​ చెబుతోంది.

ప్రముఖ దర్శకుడు పి.వాసు కుమారుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా నటించిన చిత్రం 'అలా ఇలా ఎలా'. రాఘవ దర్శకుడు. కొల్లకుంట నాగరాజు నిర్మాత. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. జులై 21న సినిమా రిలీజ్​ కానుంది.

శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వంలో రుహానీ శర్మ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం హెచ్‌.ఇ.ఆర్. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను.. ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రుహాని పోలీస్​గా నటించింది. ఇంకా 'నాతోనేను', 'జిలేబీ', 'కాజల్ కార్తీక', 'నాగద్వివం' చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజ్​ కానున్నాయి.

హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఒప్పెన్‌ హైమర్‌'. ప్రముఖ భౌతికశాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ బయోపిక్ ఈ సినిమా. సెకండ్ వరల్డ్​ వార్​ సమయంలో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా రానున్న ఈ చిత్రాన్ని జులై 21న విడుదల చేస్తున్నారు.

ఇక ఈ వారం ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. 'నెట్‌ఫ్లిక్స్'​లో ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్) జులై 19, స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3) జులై 20, దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) జులై 21 స్ట్రీమింగ్ కానున్నాయి. '

అమెజాన్‌ ప్రైమ్​'లో బవాల్‌ (హిందీ) జులై 21.. 'జీ5'లో ఎస్టేట్‌ (తమిళ) జులై 16, స్పైడర్‌మాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్స్‌ వర్స్‌ (యానిమేషన్‌) జులై 18 రిలీజ్​ అవ్వనున్నాయి. 'జియో' సినిమాలో ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) జులై 21 విడుదల కానుంది.

Tags:    

Similar News