బిగ్ బాస్ 8 : అతని ట్రాప్ లో నువ్వు పడకు.. సీత షాకింగ్ కామెంట్స్..!
మండే మొదలైన ఈ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి నామినేషన్స్ ఇన్ని సీజన్లలో ఎప్పుడు లేని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో చేయిస్తున్నారు. మండే మొదలైన ఈ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగింది. బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ లో భాగంగా సోమవారం ఎపిసోడ్ లో సోనియా, బేబక్క, శేఖర్ భాషా హౌస్ లోకి వచ్చి నిఖిల్, ప్రేరణ, యష్మి, పృధ్వి లను నామినేట్ చేశారు.
నామినేషన్స్ ప్రక్రియ నేడు కూడా కొనసాగనున్నాయి. ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం, సీత, నైనిక, మణికంఠ నేడు హౌస్ లోకి వచ్చి నామినేషన్స్ వేస్తారని తెలుస్తుంది. ఐతే హౌస్ లోకి వెళ్లాక వారి ఆట చూసిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వారు అందరి ముందు ఆడే ఆట.. మాట్లాడే మాటతో పాటుగా వారు ఒంటరిగా లేదా ఒకరిద్దరితో మాట్లాడే మాటలతో కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అలా ప్రేరణని, యష్మిని నామినేట్ చేస్తూ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఒకరి వెనకాల మరొకరు మాట్లాడొద్దని చెప్పింది.
మరోపక్క యష్మి నిఖిల్ ఎపిసోడ్ లో నువ్వు నిఖిల్ ట్రాప్ లో పడి ఆట సరిగా ఆడట్లేదని చెప్పింది. సోమవారం సోనియా కూడా నీకు అంత ఎమోషనల్ కన్సర్న్ ఉంటే యష్మి నీ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆమెకు డైరెక్ట్ గా చెప్పాలి కానీ వేరే వాళ్లకు ఎందుకు చెప్పావ్ అని అన్నది. ఇప్పుడు సీత కూడా యష్మిని ట్రాప్ లో పెట్టి ఆమె ఆట చెడగొట్టాడని చెప్పింది. ట్రాప్ అన్న మాట చాలా పెద్ద వర్డే కానీ నిఖిల్ మీద సీత ఇలా అనడం తో అతను షాక్ అయ్యాడు.
ఈ నామినేషన్స్ హౌస్ లో ఉన్న వాళ్లకే వాళ్లను కొత్తగా పరిచయం చేస్తున్నాయి. అంతేకాదు ఎవరి గురించి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అన్నది బట్టబయలు చేస్తున్నాయి. ఈ నామినేషన్స్ వల్ల నిఖిల్, యష్మి, ప్రేరణలకు పెద్ద ఎఫెక్ట్ పడేలా ఉంది. ముఖ్యంగా ఒకచోట ఒక మాట.. మరోచోట మరో మాట మాట్లాడే వారెవరు అనేది ఆడియన్స్ గుర్తించి వాళ్లను హౌస్ నుంచి పంపించేస్తారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఇన్ని నామినేషన్స్ ఒక లెక్క అయితే ఈ వారం నామినేషన్స్ మరో లెక్క అనిపించేలా ఉన్నాయి. వచ్చిన వాళ్లంతా కూడా వైల్డ్ కార్డ్స్ ని వదిలి మొదటి వారం నుంచి ఉన్న కంటెస్టెంట్స్ మీద గురి పెట్టారని తెలుస్తుంది.