సైలెంట్ గా వచ్చి షాక్‌ ఇచ్చిన 'స్పై'

కానీ ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి అమెజాన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం

Update: 2023-07-27 06:21 GMT

నిఖిల్ హీరోగా రూపొంది గత నెలలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న 'స్పై' సినిమా నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. సినిమా స్ట్రీమింగ్‌ గురించి అమెజాన్‌ ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్‌ స్ట్రీమింగ్ చేయడం తో అంతా కూడా షాక్ అయ్యారు.

సాధారణంగా ఇలాంటి క్రేజీ మూవీస్ ను రెండు మూడు రోజుల ముందు నుండే అయినా సోషల్‌ మీడియా ద్వారా స్ట్రీమింగ్ కు సంబంధించిన ప్రచారం చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి అమెజాన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం నిఖిల్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువగా సినిమాలు శుక్రవారం స్ట్రీమింగ్‌ అవ్వడం జరుగుతుంది. దాంతో వచ్చే శుక్రవారం సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిఖిల్ అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ముందస్తుగా చెప్పి ఉంటే ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో సందడి చేసేవారు.

కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన సినిమా అవ్వడం తో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా స్పై సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయింది. థియేట్రికల్‌ స్క్రీనింగ్ తో కమర్షియల్‌ గా మెప్పించలేక పోయిన స్పై సినిమా ఓటీటీ లో సందడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌ గా నటించగా సన్యా ఠాకూర్‌, ఆర్యన్‌ రాజేష్‌, నితిన్ మెహతా, రవివర్మ ముఖ్య పాత్రల్లో నటించగా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన విషయాలు చెప్పబోతున్నాం అంటూ యూనిట్‌ సభ్యులు ముందు నుండే ప్రకటించిన నేపథ్యంలో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. థియేట్రికల్‌ రన్‌ లో ఆశించిన ఫలితం అందుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీ లో ముందస్తుగా ప్రచారం చేసి ఉంటే తప్పకుండా మంచి స్పందన ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News