ఈ వారం ఓటీటీ ఫన్.. రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో ప్రతి వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు కొత్తకొత్తవి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.

Update: 2024-05-31 06:07 GMT

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో ప్రతి వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు కొత్తకొత్తవి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం పబ్లిక్ సినిమాల మీదనే ఆధారపడేవారు. లేదంటే టీవీ ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ వీక్షించేవారు. అయితే సీరియల్స్ చూసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకి ఆదరణ విపరీతంగా పెరిగింది.

అలాగే ఇతర భాషలలో తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లని ఓటీటీ ఛానల్స్ వీలైనన్ని ఎక్కువ భాషలలో డబ్బింగ్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో డిఫరెంట్ కథలు ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. భాషాబేధం లేకుండా మంచి కంటెంట్ ఎక్కడున్న ఆదరిస్తున్నారు. కొరియన్ భాషలో తెరకెక్కే వెబ్ సిరీస్ లకి ఇండియాలో ఎక్కువ ఆదరణ లభిస్తోంది అలాగే హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లని తెలుగు ఆడియన్స్ ఓటీటీ ఛానల్స్ లో వీక్షిస్తున్నారు.

పబ్లిక్ ఇంటరెస్ట్ కి తగ్గట్లుగానే ప్రతివారం ఓటీటీ స్ట్రీమింగ్ ఛానల్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ వారం ఏ ఓటీటీ ఛానల్స్ లో ఏ మూవీస్, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయనేది ఓ సారి చూసుకుంటే ఇలా ఉన్నాయి. తెలుగు ఓటీటీ ఛానల్ ఆహాలో సందీప్ కిషన్ మూవీ ప్రాజెక్ట్ జెడ్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. 6 ఏళ్ళ క్రితం ఈ సినిమా తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఎన్నో సార్లు థియేటర్స్ రిలీజ్ వరకు వచ్చి ఆగిపోయిన ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

Read more!

అమెజాన్ ప్రైమ్ లో అల్లరి నరేష్ కామెడీ చిత్రం ఆ ఒక్కటి అడక్కు మూవీ ఈ రోజు స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. థియేటర్స్ లో ఆడియన్స్ ని ఈ చిత్రం పెద్దగా మెప్పించలేదు. మరి ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి. అలాగే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ నేడు అమెజాన్ లో రిలీజ్ అయ్యింది. కల్కి 2898ఏడీ నుంచి ఈ సిరీస్ వచ్చింది. జీ5లో రణదీప్ హుడా టైటిల్ రోల్ పోషించిన స్వాతంత్ర్య వీర్ సావర్కర్ మూవీ స్ట్రీమింగ్ లో ఉంది.

ఆహా :

ప్రాజెక్ట్ Z : మే 31 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

బి అండ్ బి (బుజ్జి అండ్ భైరవ) - మే 31 నుండి స్ట్రీమింగ్

పంచాయత్ 3(వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది

ఆ ఒక్కటి అడక్కు -(మూవీ) - మే 31 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

కామ్ డెన్ (వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది

ది ఫస్ట్ ఆమెన్ (హాలీవుడ్) - స్ట్రీమింగ్ అవుతుంది

ఉప్పు పులి కారమ్ (తమిళ) - స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

ఎరిక్ (వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది

గీక్ గర్ల్ : (వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

స్వతంత్ర వీర్ సావర్కర్ (హిందీ) - స్ట్రీమింగ్ అవుతుంది

జియో

ఇల్లీగల్ 3 (హిందీ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది

దేడ్ బీఘా జమీన్ (హిందీ) - మే 31 నుండి స్ట్రీమింగ్

ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ (హాలీవుడ్) - మే 31 నుండి స్ట్రీమింగ్

Tags:    

Similar News

eac