ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే క్రేజీ సినిమాలివే

ఇదిలా ఉంటే ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే.

Update: 2024-05-20 10:46 GMT

పబ్లిక్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి బాగా అలవాటు పడ్డారు. ఫ్రీ టైం దొరికితే ఓటీటీ ఛానల్స్ లో కొత్త సినిమాలు చూస్తూ ఇంట్లోనే కూర్చొని ఎంటర్టైన్మెంట్ ని ఆశ్వాదిస్తున్నారు. నచ్చిన భాషలో ఇష్టమైన సినిమా లేదా వెబ్ సిరీస్ లని చూసే ఛాన్స్ ఓటీటీలతో ఇంట్లోనే లభిస్తోంది. సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్స్ కి వెళ్లి మూవీస్ చేటున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే.

డ్యూన్ పార్ట్ 2 జియో సినిమాలో ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీలో కూడా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆక్వామెన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్ మూవీ జియో సినిమాలోనే మే 21న రిలీజ్ కాబోతోంది. ఆక్వామెన్ సిరీస్ లో వచ్చిన రెండో భాగం ఇది కావడం విశేషం. థియేటర్స్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

ది కర్దాషియన్స్: సీజన్ 5 ఈ నెల 23న డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రారంభం కాబోతోంది. ఇంగ్లీష్ లో టెలికాస్ట్ అయ్యే ఈ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో నటించిన ఆడు జీవితం ది గోట్ లైఫ్ మూవీ మలయాళీ వెర్షన్ మే 26న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ మూవీ రోలాండ్ గారోస్ మే 26న డిస్నీ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Read more!

అమెజాన్ ప్రైమ్ లో ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ 1 వెబ్ సిరీస్ మే 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ది బ్లూ ఎంజెల్స్ డాక్యుమెంటరీ మూవీ మే 23న రిలీజ్ అవుతోంది. డీఓఏం సీజన్ 2 మే 24న ప్రసారం కానుంది. పంచాయతీ 3 వెబ్ సిరీస్ ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. దీనికి నార్త్ లో మంచి పాపులారిటీ ఉంది.

నెట్ ఫ్లిక్స్ లో ఇల్లూజన్స్ ఫర్ సేల్ డాక్యుమెంటరీ మూవీ, గారోడెన్న్ ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్ యానిమేషన్ మూవీ, ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 ఇంగ్లీష్ సినిమా మే 23న రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఫ్రాంకో ఎస్కామిల్లా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 23న విడుదల అవుతోంది. (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అట్లాస్ మే 24న రిలీజ్ అవ్వనుంది. ఆహా ఓటీటీలో సుహాస్ హిట్ మూవీ ప్రసన్నవదనం మే 24 స్త్రీమింగ్ లోకి వస్తోంది.

Tags:    

Similar News

eac