వీర‌ప్ప‌న్ జీవితంపై థ్రిల్లింగ్ ఓటీటీ సిరీస్

తాజాగా రిలీజైన ది హంట్ ఫ‌ర్ వీర‌ప్ప‌న్ టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. Catch #TheHuntforVeerappan అంటూ నెట్ ఫ్లిక్స్ ప్ర‌చారం చేస్తోంది.

Update: 2023-07-28 10:47 GMT

వీరప్పన్ భారతదేశంలో కొత్త పేరు కాదు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ గా బంధిపోటుగా అత‌డు పాపుల‌ర్. అతనిపై చాలా సినిమాలు తెర‌కెక్కాయి. చాలా సినిమాల్లో అత‌డి పాత్ర‌ను దర్శ‌క‌ర‌చ‌యిత‌లు చిత్రీక‌రించారు.

ఇప్పుడు పాపుల‌ర్ అంతర్జాతీయ OTT నెట్ ఫ్లిక్స్ 'ది హంట్ ఫర్ వీరప్పన్' బ‌యోపిక్ స్ట్రీమింగుకు రెడీ అవుతోంద‌ని ప్రకటించింది. టీజర్‌ను విడుదల చేస్తూ డాక్యుసిరీస్ నిజమైన క్రైమ్ డ్రామా క‌థతో తెర‌కెక్కింద‌ని.. ఆగస్టు 4న ప్రీమియర్‌గా ప్రదర్శిస్తామ‌ని స‌ద‌రు సంస్థ ప్రక‌టించింది.

ఈ సిరీస్‌కు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఇది తమిళం, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం భాష‌ల‌లో విడుదలకానుంది. డాక్యు సిరీస్ అద్భుత‌ క‌థాంశంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకోనుంద‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు.

వీరప్పన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్ర‌ప్ర‌దేశ్ బార్డ‌ర్ లో పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతూ శ‌త్రువుల్లో దొరికిన‌వాళ్ల‌ను దొరికిన‌ట్టే చంపేస్తూ.. ఏనుగు దంతాలు గంధ‌పు చెక్క‌ల్ని అమ్మ‌కాలు సాగిస్తూ ఎదురేలేని బందిపోటుగా ఏలాడు. అతడు అటవీ ప్రాంతంలో త‌న‌ కార్యకలాపాల ను చాక‌చ‌క్యంగా నిర్వహించేవాడు.

తాజాగా రిలీజైన ది హంట్ ఫ‌ర్ వీర‌ప్ప‌న్ టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. Catch #TheHuntforVeerappan అంటూ నెట్ ఫ్లిక్స్ ప్ర‌చారం చేస్తోంది. ఇది ఆగస్టు 4న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రదర్శిత‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. డాక్యుమెంటరీ సిరీస్ క‌థ ఎలా ఉంటుంది? అంటే..''భర్త, తండ్రి, నాయకుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వీర‌ప్ప‌న్ జీవిత‌క‌థ ఇది.

హ్యాండిల్‌బార్ మీసాలు చెంప ఎముకలతో భీక‌రంగా క‌నిపించే వీర‌ప్ప‌న్ జీవితంలో అనేక ఇతర అంశాలు దాగి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని చీకటి అడవుల్లో వీర‌ప్ప‌న్ సాగించిన మార‌ణ‌కాండ గ‌గుర్పాటుకు గురి చేస్తుంది. డాక్యు-సిరీస్ కోసం చాలా ప‌రిశోధించి నిజ‌జీవిత‌క‌థ‌ను అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.


Full View


Tags:    

Similar News