భోళా శంకర్ ట్రైలర్.. చిరు ఫుల్ కమర్షియల్ బాక్స్!

ఫైనల్ గా నువ్వు ఈడకెందుకు వచ్చినావ్ అనే డైలాగ్ కి కౌంటర్ గా మిమ్మల్నందరిని ఎంటర్టైన్ చేద్దామని అని మెగాస్టార్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు

Update: 2023-07-27 10:51 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భోళా శంకర్. భారీ బడ్జెట్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మెహర్ రమేష్ 11 ఏళ్ళ తర్వాత మరల ఈ చిత్రంతో తన స్టామినా చూపించడానికి రెడీ అవుతున్నాడు. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ మరోసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారు.

ఇన్ని హంగులతో వస్తోన్న భోళా శంకర్ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ట్రైలర్ లోకి వెళ్తే ఎంట్రీలో ఓ గ్యాంగ్ అమ్మాయిలని కిడ్నాప్ చేయడంతో స్టార్ట్ అయ్యింది. ఆ కిడ్నాప్ చేస్తోంది ఎవరు అనేది పోలీసులు ఎంత ప్రయత్నం చేసిన పట్టుకోలేదు. పబ్లిక్ కి ప్రాబ్లెమ్ వస్తే పోలీసుల దగ్గరకి వెళ్తారు. అదే పోలీసులకే ప్రాబ్లెమ్ వస్తే భోళా భాయ్ దగ్గరకి వస్తారు.. అనే డైలాగ్ తో మెగాస్టార్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు.

తరువాత అమ్మాయిలని కిడ్నాప్ చేసే గ్యాంగ్ కి లీడర్ గా విలన్ ని పరిచయం చేసి.. మమ్మల్ని టచ్ చేయాలంటే ఎవడో ఒకడు కాదు నన్ను మించిన గ్యాంగ్ స్టార్, మోన్ స్టార్, డిస్ట్రాయర్ రావాలి.. అనే డైలాగ్ తర్వాత మెగాస్టార్ లుక్ రివీల్ చేశారు.

అక్కడి నుంచి ఓ మార్కెట్ లో లోకల్ రౌడీ రవి శంకర్ గ్యాంగ్ ని కొట్టే సీన్ ని ప్రెజెంట్ చేశారు. అక్కడ నా వెనుక మాఫియా ఉంది అని విలన్ చెబితే.. నా వెనుక దునియా ఉంది.. అనే డైలాగ్ తో మెగాస్టార్ మరోసారి మాస్ మానియా చూపించారు.

తరువాత కీర్తి సురేష్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. అక్కడి నుంచి లాయర్ క్యారెక్టర్ లో తమన్నా పాత్రని ఎంట్రీ చేయించి.. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా అనే డైలాగ్ తో మెగాస్టార్ లో కామిక్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు. తరువాత సాంగ్స్ తో సందడి వాతావరణం చూపించి వెంటనే యాక్షన్ మోడ్ లోకి ట్రైలర్ షిఫ్ట్ అయ్యింది.

ఫైనల్ గా నువ్వు ఈడకెందుకు వచ్చినావ్ అనే డైలాగ్ కి కౌంటర్ గా మిమ్మల్నందరిని ఎంటర్టైన్ చేద్దామని అని మెగాస్టార్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. ఇక శ్రీముఖితో ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ విజువల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవరాల్ గా కామెడీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు పుష్కలంగా ఈ మూవీలో ఉన్నాయని ట్రైలర్ తోనే మెహర్ రమేష్ చూపించారు. ఇక మెహర్ అంటే స్టైలిష్ టేకింగ్ కేరాఫ్ అడ్రెస్. అది ప్రతి ఫ్రేమ్ లో కూడా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఎనర్జీ లెవల్స్ ని అలాగే తనలోని కామిక్ స్టైల్ ని భోళా శంకర్ లో చూపించబోతున్నాడని ట్రైలర్ తో కన్ఫర్మ్ అయ్యింది. మరి వెండితెరపై ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తోంది చూడాలి.


Full View


Tags:    

Similar News