కెప్టెన్ మిల్లర్… ఫ్రీడమ్ కోసం పోరాటం

తాజాగా ధనుష్ బర్త్ డే సందర్భంగా కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేశారు

Update: 2023-07-28 04:50 GMT

ఇప్పటి వరకు భారత్ స్వాతంత్ర్య సంగ్రామం అంటే దేశభక్తి కోణాన్ని, సెంటిమెంట్ ని ఎక్కువగా చూపించేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు మన సినిమా శైలి కూడా మారింది. భారతీయుల వీరత్వాన్ని గొప్పగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సైరా నరసింహారెడ్డి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో స్వాతంత్ర్య వీరుల గురించి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.

కొంత ఫిక్షన్ జోడించి వారి పోరాటాలని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేవిధంగా చేశారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ కథతో వస్తోన్న చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.

తాజాగా ధనుష్ బర్త్ డే సందర్భంగా కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కంప్లీట్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం విశేషం. వాంటెడ్ కెప్టెన్ మిల్లర్ అనే పోస్టర్స్ తో వీడియో స్టార్ట్ చేసి ఆ పోస్టర్ ని ధనుష్ మడతపెట్టి జేబులో పెట్టుకోవడంతో ఎండ్ చేశారు.

ఈ మధ్యలో అదిరిపోయే రేంజ్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేశారు. తెల్లదొరల నుంచి సామాన్య ప్రజలని రక్షించడానికి తుపాకి ఒక గ్యాంగ్ లీడర్ గా మారిన కెప్టెన్ మిల్లర్ కథగా మూవీ ఉండబోతోంది.

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్నారు. వారిని కూడా టీజర్ లో చూపించారు. అలాగే ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోంది. తుపాకి చేతపట్టి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరుడిగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ పాత్రని పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు.

ఈ మూవీని ఏకంగా మూడు భాగాలుగా తీసుకురాబోతున్నారంట. అందులో పార్ట్ 1 ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ నేపథ్యంలో కెప్టెన్ మిల్లర్ పోరాటాలతో ఉంటుందని తెలుస్తోంది. టీజర్ అయితే ధనుష్ నుంచి నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ మూవీ ఏ ప్రేక్షకులకి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

Full View
Tags:    

Similar News