విదేశీ టూర్లకు వెళ్లే వారు అంతలా పెరుగుతున్నారు

సరదా టూర్ల కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మన దేశంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

Update: 2024-08-05 05:02 GMT

సరదా టూర్ల కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మన దేశంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ రంగం శరవేగంగా డెవలప్ అవుతున్న విషయాన్ని తాజాగా విడుదలైన నావిగేటింగ్ హారిజన్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫిక్కీతో కలిసి రూపొందించిన ఈ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. విదేశీ టూర్లకు వెళ్లే వారి సంఖ్యతో పాటు.. వారు ఖర్చు చేయటం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

విదేశాలకు వెళ్లే మనోళ్లు ఈ ఏడాది రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. 2034 నాటికి ఈ ఖర్చు భారీగా పెరుగుతుందని.. దాదాపు రూ.4.57 లక్షల కోట్ల వరకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఫారిన్ టూర్లకు వెళ్లే వారి సంఖ్యలో భారీగా పెరిగింది. 39.2 శాతం వరకు అభివ్రద్ధి ఉండటం గమనార్హం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం.. సౌకర్యవంతంగా తిరిగి రావొచ్చన్న భావన పెరుగుతోంది.

పలు దేశాల్లో భారతీయ వంటకాలతో పాటు.. శాఖాహారాన్ని ఎంపిక చేసుకోవటానికి వీలుగా ఏర్పాట్లు ఉండటం సానుకూలంగా మారిందని నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. ఇటీవల కాలంలో ప్లాన్ చేసుకున్న బడ్జెట్ లోనే విదేశాలకు వెళ్లి వచ్చే వీలు ఉండటంతో పలువురు ఇందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆదాయాలు పెరగటం.. మధ్యతరగతి వారు పెరగటం.. వీసాలు పొందటం సులువుగా మారటం కూడా పెరిగిన విదేశీ ప్రయాణాలకు కారణంగా నివేదిక వెల్లడించింది.

పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభాతో పాటు.. యువత ఎక్కువగా ఉండటం.. వారి ఆదాయాలు భారీగా పెరుగుతుండటంతో వారు మరింత అవగాహన కోసం విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. ఈజిప్టు.. అజర్ బైజాన్.. జార్జియాలాంటి దేశాలకు సైతం వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు నివేదిక చెబుతోంది. అందుబాటు ధరల్లో వెళ్లి రావటం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News