ఈ ఎస్.యూవీలపై వేల తగ్గింపు.. లక్షల విలువైన ప్రయోజనాలు!
అవును... దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ ఎస్.యూవీల ధరలను తగ్గిస్తున్నాయి.
తాజాగా దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఎస్.యూవీల ధరలను తగ్గిస్తున్నాయి. డిమాండ్ ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... ప్రముఖ దేశీయ కంపెనీలు అయిన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి.
అవును... దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ ఎస్.యూవీల ధరలను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ తన ఫ్లాగ్ షిప్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.70 వేల వరకూ తగ్గింపును అందిస్తుంది. ఇదే సమయంలో... ఆ తగ్గింపుతో పాటు రూ.1.4 లక్షల విలువైన ప్రయోజనాలనూ అందిస్తోంది.
ఇదే క్రమంలో వీటితో పాటు నెక్సాన్.ఈవీ పైనా రూ.1.3 లక్షల వరకు ప్రయోజనాలతోపాటు, పంచ్.ఈవీ పైనా రూ.30వేల వరకూ ప్రయోజనాలు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విధంగా టాటా మోటార్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో పాపులర్ ఏయూవీలైన హ్యారియర్, సఫారీ ధరలు దిగొచ్చాయని చెబుతున్నారు.
అదేవిధంగా టాటా మోటార్స్ తోపాటు మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ కూడా తన ఎక్స్.యూవీ 700ను తీసుకొచ్చి మూడెళ్లు అయిన సందర్భంగా ఏ7 సిరీస్ వెహికల్ ధరలను రూ.2 లక్షల వరకూ తగ్గించింది. దీంతో... ఈ మోడల్ ధరలు ఇకపై రూ.19.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. తగ్గించిన ధరలు నాలుగు నెలల పాటు అందుబాటులో ఉంటాయి!