బెంజ్ అమ్మకాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తేడా అంతనా?

విలాసవంతమైన కార్ల కంపెనీల్లోమెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఖరీదైన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి విష్ లిస్టులో బెంజ్ కారు తప్పనిసరిగా ఉంటుంది.

Update: 2024-09-21 07:30 GMT

విలాసవంతమైన కార్ల కంపెనీల్లోమెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఖరీదైన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి విష్ లిస్టులో బెంజ్ కారు తప్పనిసరిగా ఉంటుంది. అయితే.. బెంజ్ కార్లను కొనుగోలు చేసే వారికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని సంస్థ వెల్లడిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బెంజ్ కార్ల అమ్మకాల జోరు 9 శాతం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో 9262 కార్లను అమ్మినట్లుగా చెప్పిన సంస్థ.. ఈ ఏడాది మొత్తంగా 11 మోడళ్లనుకొత్తగా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అందులో మూడు విద్యుత్ కార్ల మోడళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

తాము అమ్మే మొత్తం కార్లలో ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాల వాటా 2.5 శాతంగా పేర్కొన్నారు. ఈ ఏడాది 5 శాతానికి చేరినట్లుగా చెప్పారు. భారత్ లో అమ్ముతున్న కార్లలో 95 శాతం భారత్ లోనే తయారు అవుతాయని.. తాజాగా తీసుకొచ్చిన ఈక్యూఎస్ ఎస్ యూవీ 580 ఫోర్ మేలిక్ ను దేశంలోనే తయారు చేశారన్నారు. బెంజ్ కార్లను కొంటున్న వారిలో 15 శాతం మహిళలే అని పేర్కొన్నారు.

బెంజ్ కార్లకు తెలంగాణలో విపరీతమైన ఆదరణ ఉంటుందని.. తమ మొత్తం అమ్మకాల్లో 8-9 శాతం తెలంగాణలోనే ఉంటాయని పేర్కొన్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బెంజ్ అమ్మకాలు కేవలం ఒక శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బెంజ్ కార్ల అమ్మకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ -ఆంధ్రాకు మధ్యనున్న వ్యత్యాసంఇంత భారీగా ఉండటం గమనార్హం. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో మే బ్యాక్ లాంజ్ పేరుతో ఒక లాంజ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారికి సరికొత్త అనుభవం అందించటమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది.

Tags:    

Similar News