"ప్యూర్" ఈవీ పెను సంచలనం... భారత్ లో టూవీలర్స్ విప్లవం!

ఇప్పటికే మొదలైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నట్లు నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-19 04:15 GMT

ఇప్పటికే మొదలైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నట్లు నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు కూడా పర్యావరణ సహిత ఈవీ వాహనాలకే మద్దతు ఇస్తుంది. ఈ సమయంలో... భారత్ లోని టూవీలర్స్ విక్రయాల్లో సుమారు 65% వాటా ఉన్న ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ భారీ లక్ష్యాలే నిర్ధేశించుకుంది.

అవును... ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ (2వాట్స్) విభాగంలో అగ్రగామి బ్రాండ్ అయిన "ప్యూర్" ఈవీ.. 2025లో గణనీయమైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ని ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది. ఈ క్రమంలో సంస్థ ఎఫ్.ఏ.ఎం.ఈ. సబ్సిడీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా నిర్వహించింది.

నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, హెచ్.టి. వెంచర్స్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, యూఈపీఎల్, బీసీసీఎల్, ఐ-టీఐసీ, ఐఐటి హైదరాబాద్ తో సహా ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో ఈ ప్యూర్ ఈవీ కంపెనీ బలమైన పెట్టుబడిదారుల పూర్తి నమ్మకాన్ని పొందింది. గత మూడేళ్లుగా నిర్వహణ లాభాలను సాధించింది.

సరైన నగదు చెల్లింపులతో ఆర్గానిక్ విక్రయాలను నడుపుతోంది. ప్రభుత్వ రాయితీలు లేకుండానే ఈ కంపెనీ గత మూడేళ్లలో నిర్వహణ లాభాలను సాధించింది. దీంతో... సుమారు 85% వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు ఆపరేటింగ్ స్థాయిలో స్థిరంగా ప్రాఫిట్స్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది.

ఇంటర్నల్ బ్యాటరీ మేనిఫేక్చ్యురింగ్, దాని పవర్ ట్రెయిన్, సాఫ్ట్ వేర్ బ్యాక్ వర్డ్ ఇంటిగ్రేషన్ తో ప్యూర్ ఈవీ 120 మేధోపరమైన లక్షణాలను పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఐదేళ్లలో 100 ఎక్స్ వృద్ధికి సిద్ధంగా ఉన్న సెగ్మెంట్ లో నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకుంది.

ఇదే క్రమంలో... వచ్చే నాలుగేళ్లలో 20 ఎక్స్ టర్నోవర్ వృద్ధి అంచనాలతో, ప్యూర్ ఈవీ మాస్ కమ్యూట్ మార్కెట్ లో వ్యూహాత్మకంగా స్థానం పొందింది. ఇక, ఐఐటీ హైదరాబాద్ తో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యం, యూకేలోని కోవెంట్రీ నుంచి ఇంజినీరింగ్ సంస్థ పీ.డీ.ఎస్.ఎల్. తో 2026 ఆర్థిక సంవత్సరంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించి మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేయబోతోంది!

ఈ సందర్భంగా స్పందించిన ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వదేరా... 2025 భారత్ ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం కావడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, నైపుణ్యం, స్థిరత్వం పట్ల తమ నిబద్ధత ప్యూర్ ఈవీని అగ్రగామిగా నిలిపిందని.. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్ రవాణా భవిష్యత్తు "ప్యూర్" ఈవీదేనని తాను విశ్వస్తున్నామని అన్నారు.

ఇక తమ వినూత్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతికత, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించడంతో మోటార్ సైకిల్ విభాగంలో గణనీయమైన వాటాను పొందేందుకు తమకు అనుమతి లభిస్తుందని అన్నారు. ప్రతిభావంతులైన టీమ్, పెట్టుబడిదారుల మద్దతుతో తాము కేవలం వాహనాలను మాత్రమే విక్రయించడం లేదని.. తాము ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈవీ విభాగంలో ప్రాంతీయ రవాణా కార్యాలయం స్థాయిలో సుమారు 7% మార్కెట్ వాటాను ప్యూర్ ఈవీ కలిగి ఉందని అన్నారు. భారత్ అంతటా టైర్-1, టైర్-2 నగరల్లో దాని పరిధిని భారీగా విస్తరించాలనే ఆశయంతో ఉందని తెల్లిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన మోటార్ సైకిళ్లలో వృద్ధి చెందుతున్న మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.

ఇది రాబోయే ఐదేళ్లలో 100 రెట్లు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నామని రోహిత్ వదేరా వివరించారు. భారత్ లో విక్రయించే టూవీలర్ వాహనాలలో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్ సైకిళ్లదేనని స్పష్టం చేశారు. ప్రధానంగా.. సాంకేతికత అభివృద్ధి చెందడం, బ్యాటరీ ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్నందున.. ప్యూర్ ఈవీ ఈ ట్రెండ్లను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందని అన్నారు.

ఈ సమయంలో... కంపెనీ వినూత్మ ఆఫర్లు, దుకుడు మార్కెంటింగ్, బ్రాండింగ్ వ్యూహంతో కలిపి దాని డీలర్ నెట్ వర్క్ ను విస్తరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే క్రమంలో... స్కూటర్లు, మోటార్ సైకిళ్ల అమ్మకాలను వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... రాబోయే నాలుగేళ్లలో ప్యూర్ ఈవీ రూ.2000 కోట్ల టర్నోవర్ ను చేరుకొవడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. టర్నోవర్ పెరగడం వల్ల లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు!

Tags:    

Similar News