ఆ దేశంలో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ధ‌లైంది

Update: 2015-07-17 10:37 GMT
ఇండోనేసియాలో బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం కొత్త స‌మస్య‌ల్ని తీసుకొస్తోంది. అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ధ‌లుకావ‌టం ముందు వ‌ర‌కు పెద్ద ఎత్తున పొగ‌.. బూడిద‌తో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు ఇబ్బందిగా మారితే.. తాజాగా బ‌ద్ధైల‌న అగ్నిప‌ర్వ‌తం పుణ్య‌మా అని.. దీనికి స‌మీపంలోని ఆరు విమానాశ్రయాల్ని మూసేశారు.
 
ముస్లింలు అత్య‌ధికంగా ఉండే ఇండోనేషియాలో.. రంజాన్ కు ఒక రోజు ముందు ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో.. వివిధ ప్రాంతాల‌కు ప్ర‌యాణాలు కావాల్సిన వారంతా తీవ్ర ఇక్క‌ట్ల‌కు గురి అవుతున్నారు. రంజాన్ మాసానికి చివ‌రి రోజు కావ‌టంతో వివిధ ప్రాంతాల‌కు వెళ్లాల్సిన వారంతా విమానాశ్ర‌యాల్లో చిక్కుకుపోయిన ప‌రిస్థితి.

ఇలా ఉన్న వారి సంఖ్య భారీగా ఉండ‌టం.. పండ‌క్కి ఇంటికి వెళ్ల‌లేక‌పోతామ‌న్న బాధ వారిలో క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇంటికి రావాల్సిన వారి కోసం ఇండోనేషిన్ల ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. మాయ‌దారి అగ్నిప‌ర్వ‌తం రంజాన్ హుషారుని లేకుండా చేసిన‌ట్లు అయ్యింది. బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం ప్ర‌శాంతంగా మారితే..విమానాలు తిప్పాల‌ని భావిస్తున్నారు. దీంతో.. అగ్నిపర్వ‌తం ప్ర‌శాంత రూపం దాల్చాల‌ని కోరుకుంటూ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు.
Tags:    

Similar News