యూఎస్ బాక్సాఫీస్‌ అడ్వాన్స్‌ షేక్‌

బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ పఠాన్ సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు.

Update: 2023-09-05 06:34 GMT

బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ పఠాన్ సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. బాలీవుడ్‌ సినిమాలు వంద కోట్ల వసూళ్లు రాబట్టేందుకు కిందా మీదా పడుతున్న ఈ సమయంలో పఠాన్ రాబట్టిన వసూళ్లు అందరిని షాక్‌ కి గురి చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పఠాన్ సినిమా సాధించిన హిట్ నేపథ్యం లో జవాన్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

షారుఖ్ ఖాన్‌ విభిన్నమైన పాత్రలో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. చాలా ఏళ్లుగా ఈ కాంబోలో సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు సినిమా పూర్తి అయింది.. విడుదలకు సిద్ధంగా ఉంది. ఇండియాలో ఈ సినిమాకు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది.

యూఎస్ లో ఈ సినిమా విడుదలకు ముందే దాదాపుగా రెండు మిలియన్‌ ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ లో ఈ సినిమాను యష్‌ రాజ్ ఫిలింస్ వారు పంపిణీ చేస్తున్న కారణంగా సహజంగానే అక్కడ భారీ ఎత్తున అంచనాలు, ఆసక్తి కనిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

జవాన్‌ హిందీ వర్షన్ తో పాటు అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్‌ వర్షన్‌ లను యూఎస్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. పఠాన్‌ నెంబర్‌ ను దాటే విధంగా జవాన్ వసూళ్లు నమోదు అవ్వాలని అంతా కూడా బలంగా కోరుకుంటున్నారు. సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఇప్పటి వరకు అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ వసూళ్లు సాధించి సూపర్‌ డూపర్‌ హిట్ గా నిలిచాయి. అంతే కాకుండా ఈ సినిమా లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించడంతో పాటు పలువురు తమిళ స్టార్స్ నటించడం వల్ల సౌత్‌ లో మంచి హైప్ క్రియేట్‌ అయింది. మరి వసూళ్లు ఎలా ఉంటాయి చూడాలి.

Tags:    

Similar News