డ్రాగన్ బాక్సాఫీస్.. తెలుగులో కూడా తిరుగేలేదు!
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ ఫిబ్రవరి 21న విడుదలై కోలీవుడ్‌లో భారీ విజయం సాధించింది.;
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ ఫిబ్రవరి 21న విడుదలై కోలీవుడ్‌లో భారీ విజయం సాధించింది. అటు తమిళనాడులోను, ఇటు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ న్యూ ఏజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన వారాంతంలో టాలీవుడ్‌లో విడుదలైన ఇతర సినిమాలను దాటుకుని ‘డ్రాగన్’ ప్రధాన ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా తెలుగులోకి రాగా, ప్రదీప్ రంగనాథన్‌కి ఇది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది. ఇక మరోవైపు టాలీవుడ్‌లో బాగా హైప్ క్రియేట్ చేసిన ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్లలో అడుగుపెట్టింది. కానీ ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఫస్ట్ డే నుంచే దారుణమైన టాక్ తెచ్చుకుంది. మాస్, కామెడీ మిక్స్‌తో వచ్చిన ఈ సినిమా అనుకున్న రీతిలో ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.
సినిమా కథా పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే, కథనంలో బలహీనతలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మౌత్ టాక్ పూర్తిగా నెగెటివ్‌గా మారిపోవడంతో తొలి వారం చివరికి ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాలో నటించిన సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అంషు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌ని తప్పిస్తే, సినిమా కథ అంచనాలను అందుకోలేకపోయింది.
టాక్ బలంగా లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. విడుదలైన తొలి రోజు నుంచే వీకెండ్ వరకు ఈ మూవీ వసూళ్లలో ఎలాంటి పెరుగుదల కనబడలేదు. దీంతో థియేటర్లలోని హాళ్లు ఖాళీగా మారిపోతున్నాయి. ఈ ఫలితంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం వాటిల్లనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ‘డ్రాగన్’ మాత్రం విజయవంతంగా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇతర సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్న నేపథ్యంలో, ‘డ్రాగన్’ హౌస్‌ఫుల్ షోలతో బిజీగా మారుతోంది. యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథ, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా అన్నీ కలిపి, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా చూస్తే.. ఈ వారాంతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ‘డ్రాగన్’ డామినేట్ చేయగా, ‘మజాకా’ నిరాశపరిచింది. ముందు ముందు మరిన్ని కొత్త చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘డ్రాగన్’ జోరు కొనసాగుతుందా లేక కొత్త సినిమాలు దాని రన్‌ను తగ్గిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.