200 కోట్ల క్లబ్… టాప్ 10 హీరోలు వీరే

సౌత్ ఇండియాలో ఒకప్పుడు కలెక్షన్స్ వంద కోట్లు దాటడమే గగనం అయ్యేది.

Update: 2023-10-22 04:48 GMT

సౌత్ ఇండియాలో ఒకప్పుడు కలెక్షన్స్ వంద కోట్లు దాటడమే గగనం అయ్యేది. అయితే మారుతున్న కాలంతో పాటుగా సినిమాలకి ఆదరణ పెరిగింది. అదే సమయంలో టికెట్ ధరలు కూడా పెరగడంతో వంద కోట్లు అనేది ఈజీ అయిపొయింది. సౌత్ ఇండియా సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని కూడా అందుకునే స్థాయికి చేరింది.

సౌత్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరూ వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని తమ సినిమాలతో దాటిపోయారు. ఇక స్టార్ హీరోల సంగతి చూసుకుంటే రెండు వందల కోట్ల కలెక్షన్స్ ని కూడా చాలా ఈజీగా అందుకుంటున్నారు. ఇప్పటి వరకు సౌత్ లో అత్యధిక సార్లు రెండు వందల కోట్ల మార్క్ ని తమ సినిమాలతో అందుకున్న హీరోల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో దళపతి విజయ్ ఉన్నారు.

2017 లో వచ్చిన మెర్సల్ మూవీ నుంచి ఈ ఏడాది వచ్చిన వారిసు చిత్రం వరకు మొత్తం 7 సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరాయి. లియో మూవీ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది. తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్లాప్ మూవీ కూడా ఈజీగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసేస్తోంది. రోబో నుంచి జైలర్ వరకు అతని ప్రతి సినిమా ఈ క్లబ్ లో చేరింది.

ప్రభాస్ బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సాహో, ఆదిపురుష్ 200 కోట్ల క్లబ్ లో చేరాయి. సలార్ నెక్స్ట్ లైన్ లో ఉంది. విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 2 భాగాలతో పాటు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ 200 కోట్ల మైలు రాయి దాటాయి. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, పుష్ప సినిమాలు ఈ 200 కోట్ల గ్రాస్ మార్క్ బీట్ చేసాయి. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, రంగస్థలం సినిమాలు రెండు వందల కోట్లకి పోయిగా కలెక్ట్ చేశాయి.

చిరంజీవి సైరా నరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలుగా నిలిచాయి. రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ఈ జాబితాలో చేరాయి. వీరందరూ ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోల జాబితాలో ఉన్నారు. చాలా ఈజీగా తమ సినిమాలతో 200 కోట్ల మార్క్ ని అందుకుంటున్నారు.

Tags:    

Similar News