టాప్ 5 హిందీ ఫుట్‌ఫాల్స్.. నెంబర్ వన్ లో పుష్ప రాజ్
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన "పుష్ప 2: ది రూల్" సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన "పుష్ప 2: ది రూల్" సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే అత్యున్నత స్థాయికి చేరుకున్న ఈ చిత్రం, బాహుబలి వంటి భారీ రికార్డులను బ్రేక్ చేస్తూ నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సిరీస్ మొదటి భాగం "పుష్ప 1: ది రైస్" విడుదలయ్యాక కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీని షేక్ చేసింది.
అల్లు అర్జున్ ఈ సినిమాతో ఉత్తరాదిన ప్రత్యేకంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. "పుష్ప 2" భారీ అంచనాలను అందుకున్నప్పటికీ, సినిమా విడుదల తర్వాత అందరి అంచనాలను మించి విజయం సాధించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చరిత్రాత్మకం. పుష్ప 2 హిందీ వెర్షన్ 4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేయడం విశేషం. ఇది పాన్ ఇండియా స్తాయిలో టాప్ 5 హిందీ సినిమాల జాబితాలో అత్యున్నత స్థానం సంపాదించింది.
గతంలో సన్నీ డియోల్ "గదర్ 2" హిందీలో 3.4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో రికార్డు సాధించింది. అయితే "పుష్ప 2" ఆ రికార్డును అధిగమించింది. షారుక్ ఖాన్ సినిమాలు "జవాన్" 3.1 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను, "పఠాన్" 2.8 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసుకున్నాయి. ఇక గత ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో స్త్రీ 2 సినిమా కూడా ఈ లిస్టులో ఉంది హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఒక రేంజ్ లో ఆకర్షించింది.
కానీ, "పుష్ప 2" వచ్చిన ఆదరణ ప్రత్యేకమైనది. హిందీ ఆడియెన్స్ నుండి వచ్చిన ప్రేమతోనే ఈ సినిమా ఉత్తరాది మార్కెట్‌లో అల్లు అర్జున్ స్థానాన్ని మరింత బలపరిచింది. అల్లు అర్జున్ కెరీర్‌లో "పుష్ప 2" మాత్రమే కాదు, "పుష్ప 1: ది రైస్" కూడా ఉత్తరాదిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. హిందీ వెర్షన్‌లో 1.31 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను సాధించిన ఈ చిత్రం, సెకండ్ పార్ట్‌కు బలమైన పునాది వేసింది. సుకుమార్ టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, అల్లు అర్జున్ ఊరమాస్ యాక్టింగ్ అలాగే డ్యాన్సులు, క్రియేటివ్ నేరేషన్ అన్ని కూడా సినిమాకు కలిసివచ్చాయి.
టాప్ 5 హిందీ ఫుట్‌ఫాల్స్ పోస్టు పాండమిక్:
1. పుష్ప 2: ది రూల్ - 4 కోట్లు
2. గదర్ 2 - 3.4 కోట్లు
3. స్ట్రీ 2 - 3.2 కోట్లు
4. జవాన్ - 3.1 కోట్లు
5. పఠాన్ - 2.8 కోట్లు