సంక్రాంతికి వస్తున్నాం: 4 రోజుల్లో న్యూ బాక్సాఫీస్ రికార్డ్
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో సంక్రాంతికి సాలీడ్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
సంక్రాంతి పండగ సీజన్‌లో విడుదలైన వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పవర్ ను మరోసారి రుజువు చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి పండగ సందడిలో మంచి ఓపెనింగ్స్ లభించాయి. వినోదంతో కూడిన కంటెంట్ అలాగే క్రైమ్ డ్రామా కుటుంబ కథాచిత్రం అనే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి మొదటి నుంచే పాజిటివ్ హైప్ ఉండగా, విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు ఎడతెగని గుంపులుగా తరలివచ్చి వీక్షిస్తున్నారు. సినిమాకు రిపీట్ ఆడియన్స్ రావడం వల్ల కలెక్షన్లలో మరింత బలంగా నిలబడుతోంది. ముఖ్యంగా వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం.
సంక్రాంతికి వచ్చిన ప్రతీసారి కూడా ఈ కాంబినేషన్ హిట్ అని వెంకీ అనిల్ నిరూపించారు. అలాగే రెండవ రోజు నుంచే ప్రేక్షకుల తాకిడికి సినిమా స్క్రీన్స్ ను కూడా పెంచారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో సంక్రాంతికి సాలీడ్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
4వ రోజు 25 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన ఈ చిత్రం, 5వ రోజు బుకింగ్స్‌లో కూడా అదే స్థాయిని చూపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో కూడా టికెట్ బుకింగ్స్ బలంగా ఉండటంతో, వసూళ్లు అదే జోరులో కొనసాగుతాయని అంచనా. సినిమా విదేశాల్లోనూ అదరగొడుతోంది. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.
వెంకటేశ్ కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రం గా నిలుస్తున్న ఈ సినిమా పండగ సీజన్‌కి సరైన కుటుంబ కథాచిత్రంగా నిలిచింది. ఈ చిత్రం అన్ని మార్కెట్లలో బ్రేక్ఈవెన్‌ను దాటేసింది. ఇక శనివారం, ఆదివారం వీకెండ్‌లో ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించి భారీ లాభాలను అందజేయబోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చిత్రబృందం తన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. శని ఆదివారం బుకింగ్స్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా నెవ్వర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.