చరిత్రలో ఫస్ట్‌టైమ్.. 'A' రేటెడ్‌కి రూ.100 కోట్లు
పూర్తి వివరాల్లోకి వెళ్తే... మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా మార్కో అనే సినిమా రూపొంది గత ఏడాది డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఒకప్పుడు ఇండియన్ సినిమాలు రూ.100 కోట్లు రాబట్టడం అంటే చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు రూ.1000 కోట్ల సినిమాలు ఏడాదికి దాదాపు అయిదు నుంచి పది వస్తున్నాయి. అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మార్కో సినిమా రూ.100 కోట్లు రాబట్టడం హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ మలయాళ సినీ చరిత్రలో మొదటి సారి వంద కోట్ల సినిమా అంటూ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసి చర్చనీయాంశం అయ్యారు. ఇప్పటి వరకు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వంద కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాను మొదటి వంద కోట్ల సినిమా అనడానికి కారణం ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా మార్కో అనే సినిమా రూపొంది గత ఏడాది డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమా విడుదలైనప్పటి నుంచి మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా గురించి చర్చ జరిగింది. సినిమా లాంగ్ రన్‌లో రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలోని రక్తపాత సన్నివేశాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమాలోనూ చూడని షాకింగ్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ 'ఏ' సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది.
మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి 'ఏ' సర్టిఫికెట్‌తో వచ్చిన సినిమాల్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా ఇప్పటి వరకు ఒక్కటీ లేదు. మొదటి సారి మార్కో మాత్రమే రూ.100 కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం ఫ్యామిలీ, థ్రిల్లర్ సినిమాలను మాత్రమే చూస్తారు. యాక్షన్, రొమాంటిక్ సినిమాలను ఎక్కువగా చూసిన సందర్భాలు లేవు. ఒకవేళ హిట్ టాక్ వచ్చినా వంద కోట్ల వసూళ్లు మాత్రం రాబట్టలేదు. మార్కో మొదటి సారి మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ రేటెడ్ వంద కోట్ల సినిమాగా నిలిచింది.
హనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు షరీఫ్ ముహమ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్‌లో నటించగా ముఖ్య పాత్రల్లో సిద్దిక్, జగదీష్, అభిమన్యు, కబీర్ దుహన్ సింగ్, అన్సన్ పాల్ మరియు యుక్తి తరేజా సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో 6వ సినిమాగా మార్కో నిలిచింది. ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మార్కో 9వ స్థానంలో నిలిచింది. అతి తక్కువ సమయంలోనే వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన మార్కో సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తుంది.