గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్.. నార్త్ లెక్కలు ఇలా..
ఇక దేవర సినిమాతో ఎన్టీఆర్ కూడా హిందీ మార్కెట్ పై పట్టు సాధించాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2తో ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఊహించని రికార్డ్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం "గేమ్ చేంజర్" హిందీ భాషలో కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు నార్త్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రతీ సినిమాతో బాలీవుడ్ రికార్డులను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక దేవర సినిమాతో ఎన్టీఆర్ కూడా హిందీ మార్కెట్ పై పట్టు సాధించాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2తో ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఊహించని రికార్డ్. ఇక గేమ్ ఛేంజర్ కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుందని అందరూ అనుకున్నారు. RRR సినిమాతో హిందీలో కూడా చరణ్ కు మంచి క్రేజ్ దక్కిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తోనే నార్త్ లో భారీగా థియేటర్స్ లభించాయి.
ఇక మొదటి రోజు నుండి హిందీలో ఈ చిత్రానికి మంచి ప్రదర్శనలు లభించినప్పటికీ, వసూళ్లు మాత్రం అనుకున్న స్థాయికి చేరలేకపోయాయి. భారీ హైప్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు 6,843 షోల ద్వారా రూ.7.44 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండవ రోజు రూ.7.24 కోట్ల గ్రాస్ సాధించింది.
మూడవ రోజు ఈ సినిమా కలెక్షన్లు కొద్దిగా మెరుగయ్యాయి. రూ.8.04 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం హిందీ మార్కెట్లో స్లో అండ్ స్టెడీగా ప్రదర్శన కొనసాగిస్తోంది. కానీ వీకెండ్ ముగిసిన తర్వాత నాలుగో రోజు నుండి కలెక్షన్లు క్రమంగా పడిపోవడం మొదలైంది. నాలుగో రోజు 6,015 షోల ద్వారా రూ.1.66 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత రోజులు కలెక్షన్లలో మరింత తగ్గుదల కనిపించింది.
ఐదవ రోజు ఈ చిత్రం రూ.2.08 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఆరో రోజు 5,730 షోల ద్వారా రూ.1.11 కోట్లకు పరిమితమైంది. సినిమా మీద నెగెటివ్ టాక్ ఉండటంతో, హిందీ భాషలో వసూళ్లలో పెద్దగా పెరుగుదల చూడలేకపోయింది. ఏడవ రోజు కల్లా 5,707 షోల ద్వారా కేవలం రూ.0.80 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకోవడం గమనార్హం. మొత్తం మీద, "గేమ్ చేంజర్" హిందీలో ఇప్పటి వరకు ట్రాక్ చేసిన వసూళ్లు రూ.28.37 కోట్ల గ్రాస్ మాత్రమే. అయితే, అంచనా ప్రకారం నెట్ వసూళ్లు రూ.26.5 కోట్ల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా హిందీ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భారీ షోలు లభించినప్పటికీ, ప్రేక్షకులలో సినిమా పట్ల ఆశించిన ఆసక్తి ఏర్పడలేదు. కంటెంట్ పట్ల ప్రేక్షకుల మిశ్రమ స్పందన కారణంగా వసూళ్లలో తేడా కనిపించినట్టు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక గేమ్ చేంజర్ హిందీ భాషలో సాధించిన ఈ ఫలితాలు, పాన్ ఇండియా సినిమాల బిజినెస్ మీద కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను అందించలేకపోతే, భారీ ప్రొమోషన్స్ కూడా సినిమాను నిలబెట్టలేవు అనేది గేమ్ చేంజర్‌తో స్పష్టమవుతోంది.
గేమ్ చేంజర్ హిందీ కలెక్షన్లు
Day 1: 6,843 షోస్ - గ్రాస్: ₹7.44 కోట్లు - ఆక్యుపెన్సీ: 19.14%
Day 2: గ్రాస్: ₹7.24 కోట్లు - ఆక్యుపెన్సీ: 17.96%
Day 3: గ్రాస్: ₹8.04 కోట్లు - ఆక్యుపెన్సీ: 19.84%
Day 4: 6,015 షోస్ - గ్రాస్: ₹1.66 కోట్లు - ఆక్యుపెన్సీ: 5.73%
Day 5: గ్రాస్: ₹2.08 కోట్లు - ఆక్యుపెన్సీ: 7.98%
Day 6: 5,730 షోస్ - గ్రాస్: ₹1.11 కోట్లు - ఆక్యుపెన్సీ: 4.53%
Day 7: 5,707 షోస్ - గ్రాస్: ₹0.80 కోట్లు - ఆక్యుపెన్సీ: 3.27%
మొత్తం గ్రాస్: ₹28.37 కోట్లు