ఐఫోన్ మా(ని)యా... ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్న రిటైలర్లు!

అవును... యాపిల్ ప్రొడక్ట్స్ అంటే చాలా మందికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ సమయంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభమైంది

Update: 2023-09-27 04:17 GMT

ప్రస్తుతం భారత్ లో ఐఫోన్ 15 సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా ఐఫోన్స్‌ కి డిమాండ్ భారీగా ఉండటంతో ఇండియాపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వారి అభిప్రాయానికి మరింత బలం చేకూర్చేలా ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభం సందర్భంగా నెలకొన్న సంగడి తెలిసిందే. దీంతో రిటైలర్లు ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది.

అవును... యాపిల్ ప్రొడక్ట్స్ అంటే చాలా మందికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ సమయంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభమైంది. ఆరోజు ఫోన్ ని సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఎంత ఉత్సాహం చూపించారనేదీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు రిటైలర్లు.

ప్రస్తుతం భారత్ లో ఐఫోన్ - 15 మేనియా నడుస్తున్న నేపథ్యంలో... ఆ అత్యుత్సాహాన్ని, ఆసక్తిని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారంట రిటైలర్లు. తక్కువ ఫోన్స్ ఉన్నాయని చెప్పడం, అవి ఆల్ రెడీ బుక్కింగ్స్ లో ఉన్నాయని చెప్పడం, మీకు కావాలంంటే మరో 20 - 30 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని కోరడం చేస్తున్నారంట.

అవును... ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ల ఎమ్మార్పీ ధరలపై సుమారు రూ. 20వేలు నుంచి రూ. 30వేలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ విషయంలో డబ్బా ముఖ్యం.. ప్రిస్టేజ్ ముఖ్యం.. ఈ ఫోన్ కొనాలి, వెంటనే స్టేటస్ మార్చాలి, సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసుకోవాలి.. అనేది మరికొందరి అత్యుత్సాహంగా ఉందంట. దీంతో... వీరి అత్యుత్సాహాన్ని రకరకాల కారణాలతో రిటైలర్లు క్యాష్ చేసుకుంటున్నారని అంటున్నారు!

కాగా... భారతీయ మార్కెట్లో 15 సిరీస్ మొబైల్స్... ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ధరలు స్టోరేజ్ ఆప్సన్స్ మీద ఆధారపడి ఉంటాయి. 128 జీబీ స్టోరేజ్ కలిగిన 15 ప్రో ధర రూ. 1,34,900 అయితే... అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1 టీబీ ధర రూ. 1,99,900 వరకు ఉంది.

Tags:    

Similar News