గూగుల్ కు బీజేపీ అంత భారీ బిజినెస్ ఇచ్చిందా?

భారత రాజకీయ పార్టీలు ఇచ్చిన బిజినెస్ లో బీజేపీ వాటా 26 శాతంగా పేర్కొన్నారు. గూగుల్.. యూట్యూబ్ లకు ప్రకటనల రూపంలో దాదాపు రూ.101 కోట్లను ఖర్చ చేసినట్లుగా గుర్తించారు.

Update: 2024-04-27 10:30 GMT
గూగుల్ కు బీజేపీ అంత భారీ బిజినెస్ ఇచ్చిందా?
  • whatsapp icon

సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. సెర్చింజిన్ లో తోపు లాంటి గూగుల్ కు.. వీడియో ఆధారిత ప్లాట్ ఫాంలో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించే యూట్యూబ్ కు భారతీయ జనతాపార్టీ భారీ బిజినెస్ ఇచ్చిన వైనం వెలుగు చూసింది. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. బీజేపీ వీటి కోసం భారీగా ఖర్చు చేసిన వైనం బయటకు వచ్చింది.

2018 మే 31 నుంచి 2024 ఏప్రిల్ వరకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు లెక్కల్ని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. పాతిక రాజకీయ పార్టీల ఖర్చును మదింపు చేసిన సదరు సంస్థ.. ఏయే పార్టీ ఎంత చొప్పున ఖర్చు చేసిందన్న వివరాల్నివెల్లడించింది. గడిచిన ఆరేళ్లలో రాజకీయ ప్రకటనల రూపంలో గూగుల్.. యూట్యూబ్ లకు భారత రాజకీయ పార్టీల నుంచి రూ.390 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో బీజేపీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయటం గమనార్హం.

భారత రాజకీయ పార్టీలు ఇచ్చిన బిజినెస్ లో బీజేపీ వాటా 26 శాతంగా పేర్కొన్నారు. గూగుల్.. యూట్యూబ్ లకు ప్రకటనల రూపంలో దాదాపు రూ.101 కోట్లను ఖర్చ చేసినట్లుగా గుర్తించారు. గూగుల్ యాడ్స్.. గూగుల్ డిస్ ప్లే.. వీడియోపై రూ.45 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే గూగుల్ యాడ్స్ లో రూ.42 కోట్లు ఖర్చు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ రూ.42 కోట్లలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.16.6 కోట్లు ఖర్చు చేయటం గమనార్హం.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో గతనవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార బీఆరర్ఎస్ గూగుల్ యాడ్స్ కోసం రూ.12కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని తేల్చారు. అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలు కావటం గమనార్హం. ఏపీ విషయానికి వస్తే అధికార వైపీపీ గూగుల్ యాడ్స్ రూపంలో గడిచిన ఆరేళ్లలో రూ.6.4కోట్లు.. పశ్చిమబెంగాల్అధికారపక్షం టీఎంసీ రూ.4.8కోట్లు ఖర్చు చేసినట్లుగా గుర్తించారు.

Tags:    

Similar News