గాడిద పాలకు అంత ధరా?
మార్కెట్లో గాడిద పాలకు ఉన్న విలువ అతడికి మంచి ఆదాయం తీసుకొస్తోంది. నెలకు సుమారు రూ. 3 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు. ఈ రోజుల్లో డబ్బు సంపాదన కష్టంగానే మారింది. ఆశించిన మేర సంపాదన లేకపోవడంతో చాలా మంది నిరాశతోనే జీవిస్తున్నారు. కానీ నిజాయితీగా ఆలోచిస్తే ఫలితం మనకు కచ్చితంగా దొరుకుతుంది. పనులు అందరు చేస్తారు. కానీ ఆలోచించి చేసే వారికి అద్భుత ఫలితాలు అందివస్తాయి.
గుజరాత్ కు చెంది సోలంకి గాడిదలను పోషిస్తున్నాడు. వాటి పాలతో వచ్చిన ఆదాయంతో లక్షాధికారిగా మారాడు. అతడి ఎనిమిది నెలల క్రితం రూ. 22 లక్షలు పెట్టుబడి పెట్టి గాడిదలను కొనుగోలు చేశాడు. గాడిదల ఫామ్ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద 42 గాడిదలున్నాయి. వాటి పాలకు భలే డిమాండ్ ఉంది. ఒక్కో లీటర్ కు రూ. 7 వేల ఆదాయం వస్తుందంటే అతిశయోక్తి కాదు.
మార్కెట్లో గాడిద పాలకు ఉన్న విలువ అతడికి మంచి ఆదాయం తీసుకొస్తోంది. నెలకు సుమారు రూ. 3 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. పాల పొడి అయితే కిలో రూ. లక్ష వరకు పలుకుతుందంటే గాడిద పాలకు ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. ఎవరైనా పని లేకుండా తిరిగితే గాడిదలను కాస్తున్నావా అని గేలి చేస్తారు. కానీ ఇప్పుడు ఆ గాడిదలే లక్షల ఆదాయం సమకూర్చుతున్నాయంటే వాటి విలువ ఏపాటిదో తెలిసిపోతుంది.
గాడిద అత్యంత శుభశకునం. మనం ఎటైనా ప్రయాణం చేస్తుంటే గాడిద ఎదురైతే మనకు శుభమే కలుగుతుంది. అలాంటి గాడిదలు అతడి జీవితాన్నే మార్చేశాయి. లక్షాధికారిని చేశాయి. వాటి పాలు, పాల పొడితో అతడి ఆదాయం రెట్టింపు స్థాయిలో వస్తోంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా అతడి వ్యాపారం విరాజిల్లుతోంది. గాడిదల వల్ల కూడా ఇంత లాభం ఉంటుందా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
అతడిని చూసి చాలా మంది గాడిదల వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. గాడిద పాలతో వ్యాపారం ఇంత బాగా ఉంటుందని తెలియడంతో గాడిదల వ్యాపారం బాగుందని అనుకుంటున్నారు. మార్కెట్లో లీటర్ గాడిద పాల ధర రూ. 5-7 వేలు ఉండటంతో గాడిదలను కొనుగోలు చేయాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.