రతన్ టాటా.. ప్రపంచ కుబేరుడు కాదు.. అంతకమించి?

కాగా, ఇంతటి దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' పేరు కుబేరుల జాబితాలో ఎందుకు లేదనే సందేహం ఒక ప్రశ్ననే.

Update: 2023-09-27 14:30 GMT

సముద్రంలో దొరికే ఉప్పు నుంచి గాలిలో ఎగిరే విమానాల వరకు.. చేతికి పెట్టుకునే వాచీల దగ్గరనుంచి సాఫ్ట్ వేర్ వరకు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర.. నాణ్యతకు నాణ్యత.. సేవలకు సేవలు.. వినియోగదారుడికి గౌరవం ఇవ్వడంలో కానీ.. వస్తువులను నాణ్యంగా తీసుకురావడంలో కానీ.. ఆ సంస్థలకు తిరుగులేదు. ఒకటా.. రెండా.. వందేళ్ల మన్నిక ఆ సంస్థ. కానీ, ఆయన మాత్రం ప్రపంచ కుబేరుడు కాదు.. తనకంటే ఎంతో వెనుక వచ్చిన వ్యక్తులు ఎప్పుడో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నిలిస్తే.. ఆయన మాత్రం అందుకు అర్రులు చాచడం లేదు. అదేమంత గొప్ప కాదనేది వారి అభిప్రాయం.

స్వాతంత్ర్యానికి పూర్వమే.."టాటా"లు అంటే కేవలం సంస్థనో వ్యక్తులో కాదు.. అది ఓ నమ్మకం. స్వాతంత్ర్యానికి పూర్వమే దేశంలో పారిశ్రామిక పునాదులు వేసిన కుటుంబం అది. అందుకే టాటాలంటే అందరికీ గౌరవం. వారి తర్వాత 50 ఏళ్లకు వచ్చిన అంబానీలు.. 100 ఏళ్లకు వచ్చిన ఆదానీలు ప్రపంచ కుబేరులు అయ్యారు. కానీ, టాటాలు మాత్రం కాలేకపోయారు. కాదు.. కాదు.. వారికా ఉద్దేశం లేదు.

డబ్బు కాదు.. పేరు ప్రపంచ ధనవంతుల జాబితా చూస్తే.. దేశంలోనే ధనికులైన వ్యక్తుల గురించి ఆరా తీస్తే.. అందులో రతన్ టాటా ఉండరు. దేశంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలోనూ కనిపించరు. కానీ, ఆయన అంతకంటే ఎక్కువ అభిమానాన్ని దేశంలో సంపాదించారు. అంతకుమించిన ప్రేమ-గౌరవాలను పొందారు. కాగా, ఇంతటి దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' పేరు కుబేరుల జాబితాలో ఎందుకు లేదనే సందేహం ఒక ప్రశ్ననే.

ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద రూ.వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బునుర దాతృత్వానికి వినియోగించడమే.

అపార వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో దేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. అందుకే టాప్ 10 ధనవంతుల జాబితాలోనూ లేరు.

2021-22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.

ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న రతన్ టాటా కార్యకలాపాలను తగ్గించుకున్నారు. కేవలం ముఖ్యమైన వాటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికీ ఆయన బయటకు వస్తే చూడాలని తపించేవారెందరో ఉన్నారు. అలాంటి రతన్ టాటా ఒక వ్యక్తి కాదు.. మహా శక్తి అనడంలో ఏమైనా సందేహం ఉందా?

Tags:    

Similar News