అవును.. ఆమె ముకేశ్ అంబానీని దాటేసింది!
ఇంతకూ ఆమె ఎవరంటే.. జిందాల్ గ్రూప్ స్థాపించిన ఓంప్రకాశ్ జిందాల్ సతీమణే ఈ సావిత్రి జిందాల్.
దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ.. దేశీయంగా ఒక పెద్దావిడ ముందు వెనుకబడిపోయారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది (2023) ఇస్పెషల్ గా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఈ ఏడాది ఆర్జనలో ముకేశ్ అంబానీని దాటేసి సంచలనంగా మారారో ఓ పెద్దావిడ. ఆవిడ ఎవరోకాదు.. సావిత్రి జిందాల్. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె.. భారత దేశంలో ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా నిలిచారు. ఇంతకూ ఆమె ఎవరంటే.. జిందాల్ గ్రూప్ స్థాపించిన ఓంప్రకాశ్ జిందాల్ సతీమణే ఈ సావిత్రి జిందాల్.
ఓంప్రకాశ్ జిందాల్ మరణించిన తర్వాత ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూపులో పలు సంస్థలు ఉన్నాయి. ఆ జాబితాను చూస్తే..
- జేఎస్ డబ్ల్యూ స్టీల్
- జేఎస్ డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్
- జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ
- జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ తదితర కంపెనీలు ఉన్నాయి.
ఈ ఏడాది ఈ కంపెనీలకు చెందిన షేర్లు దేశీయ మార్కెట్లో బాగా పెరిగాయి. దీంతో.. సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశంలో కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచినప్పటికీ.. ఉప ఖండంలో మహిళా సంపన్నుల జాబితాలో ఆమె టాప్ గా నిలుస్తారు. ఈ ఒక్క ఏడాదిలో ఆమె సంపద 9.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో.. ఆమె మొత్తం సంపద 25.3 బిలియన్ డాలర్లు. అయితే.. ఈ మొత్తం ముకేశ్ అంబానీ సంపద కంటే తక్కువైనప్పటికీ.. ఈ ఏడాది ఆర్జనలో ముకేశ్ కంటే ఎక్కువగా ఉన్నారు.
తాజాగా విడుదల చేసిన జాబితాలో సావిత్రి జిందాల్ తర్వాత.. ఈ ఏడాదిలో అత్యధికంగా ఆర్జించిన రెండో స్థానం హెచ్ సీఎల్ టెక్ అధినేత శివ్ నాడార్ నిలిచారు. ఆయన ఏడాది సంపద 8 బిలియన్ డార్లు. రియల్ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. ఈఏడాదిలో ఆయన సంపద 7.15 బిలియన్ డాలర్లమేర పెరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా.. షాపూర్ మిస్త్రీ లు ఈ ఏడాది తమ సంపదను 6.3 బిలియన్ డాలర్లుగా పెంచుకున్నారు.
వీరంతా జాబితాలో టాప్ 5లో ఉన్న వేళ.. రిలయన్స్ అధినేత.. దేశీయ కుబేరుడిగా తొలిస్థానంలో నిలిచే ముకేశ్ అంబానీ.. ఈ ఏడాదిలో ఆర్జించిన మొత్తం 5.2 బిలియన్ డాలర్లు మాత్రమేకావటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హిండెన్ బర్గ్ రిసెర్చి నివేదికతో గౌతమ్ అదానీ భారీగా సంపద పోగొట్టుకున్నారు. దీంతో.. ఈ జాబితాలో ఆయన పరిస్థితి తారుమారైంది.ఇక.. ప్రపంచంలో టాప్ 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబాన.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రెండో స్థానంలో మాత్రం అందరి అంచనాలకు తగ్గట్లే అదానీ ఉన్నారు.