స్టార్ హీరోల వైఫ్ లు..బిజినెస్ ఉమెన్ లు!
ఇంకా పలువురి యంగ్ హీరోల భార్యలు వివిధ బిజినెస్ ల్లో రాణిస్తున్నారు
పాత తరం స్టార్ హీరోల సతీమణులంటే దాదాపు గృహిణులే. పిల్లలు..సంసార జీవితం తప్ప ఇతర రంగాల్లో పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. చిరంజీవి జనరేషన్ హీరోల్ని చూసుకుంటే కేవలం నాగార్జున వైఫ్ అమల మాత్రమే కొన్ని రకాల వ్యాపారాలు..సామాజిక సేవలంటూ సమయాన్ని కేటాయించి పనిచేస్తు న్నారు. మిగతా హీరోల భార్యలకు ఇంటికే పరిమితం. ఆ తర్వాత తరం నటులైన మహేష్..రామ్ చరణ్.. ఎన్టీఆర్...బన్నీ సతీమణులు మాత్రం వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు.
మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికే కొన్నాళ్లు అంకితమైన తర్వాత బిజినెస్ లో బిజీ అయ్యారు. మహేష్ వ్యాపార వ్యవహారాలన్ని ఆమె చూసుకుంటున్నారు. మహేష్ బ్రాండింగ్స్ నుంచి ప్రతీ విషయంలోనూ నమ్రత కీలక భాగస్వామి.
ఏఎంబీ మాల్ నిర్వహణ.. టెక్స్‌టైల్స్.. ఫుడ్ బిజినెస్ లు మొత్తం ఆమె చూసుకుంటున్నట్లు సమాచారం. అలాగే చరణ్ సతీమణి ఉపాసన మొదటి నుంచి బిజినెస్ ఉమెన్. తల్లిదండ్రులే ఆమెని పెళ్లికి ముందుగానే బిజినెస్ రంగంలోకి తీసుకెళ్లారు.
అపోలోగ్రూప్ డైరెక్టర్స్ లో ఆమె ఒకరు. ఇంకా చరణ్ పెట్టుబడులు పెట్టిన ఎయిర్ లైన్స్ బిజినెస్- యువర్ లైఫ్ అనే హెల్త్ మాగజైన్ బాధ్యతలు ఆమె చూసుకుంటున్నారు. బన్నీతో వివాహానికి ముందు వరకూ సాధారణ జీవితాన్ని గడిపిన స్నేహారెడ్డి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ సోషల్ మీడియా యాక్టివిటీస్ మొత్తం ఆమె దగ్గరుండి చూసుకుంటారు. స్నేహ తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్‌గా బాధ్యతల్ని ఆమె దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారు.
మునుముందు బన్నీ నిర్వహిస్తోన్న వ్యాపారాలన్నింటిలోనూ ఆమె కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఇంతకాలం కుటుంబ జీవితాన్నే గడిపారు. ఆమె కూడా బిజినెస్ రంగంలోకి ఎంటర్ అవుతున్నట్లు సమయాచారం. త్వరలోనే స్వయంగా మాఎ ఓ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌ను స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది. అలాగే నేచురల్ స్టార్ నాని సతీమణి అంజనా ఆర్కా మీడియా వర్క్స్ కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే 'బాహుబలి' లాంటి సినిమాలకు ఆమె పనిచేసారు. ఇక అల్లరి నరేష్ సతీమణి విరూప కూడా బిజినెస్ ఉమెన్ అనే తెలుస్తోంది. స్వయంగా ఆమె ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నడుపుతు న్నారు. ఇంకా పలువురి యంగ్ హీరోల భార్యలు వివిధ బిజినెస్ ల్లో రాణిస్తున్నారు. ఇంజనీర్లుగా..డాక్టర్లుగా తమ చదువులకు అనుగుణంగా ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నారు. వివాహం వ్యాపారానికి..ఉద్యోగానికి అడ్డు కాదని మహిళా మణులంతా నిరూపిస్తున్నారు.