సూప‌ర్ స్టార్ చిత్రంలో ఆ స్టార్ హీరో ఎంట్రీ షురూ!

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `కూలీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-09 05:29 GMT

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `కూలీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీల‌క పాత్ర కింగ్ నాగార్జున కూడా న‌టిస్తున్నారు. ర‌జ‌నీ కాంత్-నాగార్జున‌ల‌ను ఒకే ప్రేమ్ లో చూసే అవ‌కాశం రావ‌డంతో ఇద్ద‌రి హీరోల అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇదే చిత్రంలో మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కూడా న‌టిస్తున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది.

కానీ దీని గురించి మేక‌ర్స్ నుంచి స్పంద‌న రాలేదు. ఆయ‌న న‌టిస్తున్న విష‌యాన్ని చెప్ప‌లేదు. న‌టించ‌లేదు అని ఖండించ‌ను లేదు. దీంతో అప్ప‌టి నుంచి అమీర్ ఎంట్రీ అన్న‌ది స‌స్పెన్స్ గానే మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం అమీర్ ఖాన్ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఆయ‌న పాత్ర‌కు సంబంధించి షూటింగ్ కు కూడా హాజ‌ర‌వుతున్నారట‌. సినిమాలో ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని, క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర అని..లోకి మార్క్ లో ఆ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తాడ‌ని అంటున్నారు.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌నొస్తుంద‌ని వినిపిస్తుంది. స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించ‌డానికి అమీర్ ఖాన్ కి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. ఆయ‌న ఎంతో డౌన్ టూ ఎర్త్. సౌత్ న‌టీ న‌టుల‌తో ఎంతో స్నేహంగా మెలుగుతారు. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున అయ‌న‌కు ఎంతో మంచి స్నేహితులు. అమీర్ న‌టించిన సినిమాల్ని హైద‌రాబాద్ లో ప్ర‌మోట్ చేయాలంటే చిరు, నాగ్ రంగంలోకి దిగుతారు.

కోలీవుడ్ లోనూ ర‌జనీకాంత్ తో మంచి స్నేహం ఉంది. ఇప్పుడా స్నేహం కార‌ణంగా లోకేష్ ఆప‌ర్ ని అమీర్ అంగీక‌రించిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ,సౌబిన్ షాహిర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది.

Tags:    

Similar News