వీడియో: అమీర్ కుమార్తె వింతైన పెళ్లి పిలుపు
ఈ వీడియోని పర్ఫెక్ట్ ఎడిటింగ్ తో రిలీజ్ చేయడంతో ఎంతో ఆసక్తిని కలిగించింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవల తన కుటుంబంతో విలువైన సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా తన కుమార్తె ఇరా ఖాన్ ని విడిచి ఉండడం లేదు. ఇప్పుడు ఇరా ఖాన్ పెళ్లికి సమయమాసన్నమైంది. తన ప్రియుడు నుపుర్ శిఖరేని ఇరా ఖాన్ జనవరిలో వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే అంటే నెలరోజుల ముందు నుంచే పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. కౌంట్‌డౌన్ ప్రారంభమైనందున ఇరా తన స్నేహితులకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపింది. పెళ్లి పిలుపు పేరుతో ఇరా వారికి ఒక పజిల్ని పంపారు.. దానిని వారు కెమెరా ల్లోకి చూస్తూ పరిష్కరించాలి. ఇరా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వారి స్పందనను కూడా షేర్ చేసింది. ఈ వీడియోని పర్ఫెక్ట్ ఎడిటింగ్ తో రిలీజ్ చేయడంతో ఎంతో ఆసక్తిని కలిగించింది.
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వీడియోను షేర్ చేస్తూ, ``పొపాయ్: బిట్ బై బిట్ ఎడిట్ చేయండి. నేను: ఒక్క రాత్రిలో చేస్తా. ఇది ఏప్రిల్ నుండి చేయవలసి ఉంది. ఎప్పుడూ కంటే ఆలస్యం. అలాగే ఇప్పుడు ఆనందం.. మేము (నుపుర్ - ఇరా) ఒక నెలలో వివాహం చేసుకోబోతున్నాము! నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని వ్యక్తుల వైవిధ్యం .. పరిధిని మీరు చూస్తున్నారా? వీడియో మొత్తం చూడండి. దేనినీ మిస్ చేయవద్దు. నేను ఈ ఫుటేజీని చాలా సార్లు చూశాను. అది ఇప్పటికీ ప్రతిసారీ నా హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఇప్పుడు ఎవరైనా బ్యాచిలొరెట్ వీడియోని రూపొందించండి. పెళ్లికి సంబంధించిన ఎడిటింగ్ కోటా అయిపోయింది`` అని రాసింది. . #పెళ్లికూతురు #కౌంట్‌డౌన్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని వైరల్ చేస్తోంది. ఈ ఆనంద సమయంలో తన స్నేహితులను ఒక్కొక్కరిని పేరు పేరునా పిలుస్తూ ఇరా ఖాన్ వారందరినీ పెళ్లికి ఆహ్వానించింది.
గత నెలలో ఇరాను పెళ్లాడుతున్న నూపూర్ ఇంట్లో కెల్వన్ అనే ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ వేడుక నుండి అమీర్ ఖాన్ కనిపించకపోయినా కానీ, ఇరా తల్లి రీనా దత్తా వేడుకకు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం ఇరా పిష్వాయ్ నాథ్‌తో కూడిన గులాబీ చీరను ధరించి కనిపించింది. ఇంతలో నూపుర్ కుర్తా, జీన్స్ ప్యాంట్ వేసుకుని కనిపించాడు. మహిళలు వేడుకను నిర్వహిస్తున్నప్పుడు ఈ జంట సంతోషంగా కలిసి కూర్చున్నారు. ఇరా ఒక వింతైన క్యాప్షన్‌తో పాటు ఈ ఫోటోలను షేర్ చేసింది.
అమీర్ ఖాన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి తేదీని ధృవీకరించారు. జనవరి 3న పెళ్లి జరగనుందని తెలిపారు. అలాగే కాబోయే అల్లుడు నుపూర్ ని కూడా అమీర్ ప్రశంసించారు.