మార్కెట్ లో స్టార్ హీరో న్యూ స్ట్రాటజీ!
శాటిలైట్...డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులనేవి సినిమా రిలీజ్ కి ముందే పూర్తవుతాయి.
శాటిలైట్...డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులనేవి సినిమా రిలీజ్ కి ముందే పూర్తవుతాయి. స్టార్ హీరో ఉన్న ఇమేజ్ ని బట్టి ఆయా సంస్థలు కంటెంట్ ని కొనుగోలు చేస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాలకు ఈ రకంగా ఎలాంటి ఢోకా ఉండదు. పెట్టిన పెట్టుబడి సహా భారీ లాభాలు ఈ రూపంలోనే వచ్చేస్తున్నాయి. ఇక థియేట్రికల్ బిజి నెస్ అన్నది అదనంగా మారుతుంది. అయితే ఇదంతా ఆయా హీరోల ఇమేజ్ మీద ఆధారపడుతుంది.
ఈనేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ రకమైన బిజినెస్ లో కొత్త స్ట్రాటజీలో వెళ్లాలను కుంటున్నారుట. శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో తాజా స్ట్రాటజీని అమలు చేయాలనుకుంటున్నా రుట. సాధారణంగా సినిమాలకు బాక్సాఫీస్ ఫలితం ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంటారు. కానీ ఇది అన్ని సినిమాలకు జరగదు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో వర్కౌట్ అవ్వదు.
థియేటర్లో సినిమా పోయిందంటే కంటెంట్ ని కొనే పరిస్థితి కూడా ఉండటం లేదు. అందుకే అమీర్ ఖాన్ తన తాజా సినిమా సితారే జమీన్ కి ఈ కొత్త స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదలై థియేటర్లలో స్పందన చూసిన తర్వాత శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మాలని తన ప్రొడక్షన్ టీంకు సూచించినట్టు వినిపిస్తుంది. ఈ సినిమాని అమీర్ నిర్మిస్తున్నారు. శాటిలైట్..డిజటల్ సంస్థలు-నిర్మాతల మధ్య మంచి బంధం కొనసాగాలేంటే మనం అందించే కంటెంట్ పై కంపెనీలకు నమ్మకం ఉండాలని అమీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా మార్కెట్ అన్నది ఇప్పుడు ఎలా జరుగుతందన్నది తెలిసిందే. ప్లాప్ కంటెంట్ ని కూడా మంచి సినిమా అంటూ రిలీజ్ కి ముందు హడావుడి చేసి లాభ పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. శాటిలైట్.. ఓటీటీలు ఏర్పాటైన కొత్తలో ఎక్కువగా ఇదే తరహాలో వ్యాపారం జరిగేది. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు.