ట్రెండీ టాక్: అమీర్ ఖాన్ 1000 కోట్ల ఒప్పందం?
భారతదేశంలోని ప్రముఖ స్టూడియో జియో స్టూడియోస్‌తో అమీర్ ఖాన్ మల్టీ మూవీ డీల్ ఇప్పుడు మరో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి.
అమీర్ ఖాన్ ఇటీవల 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంతో డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించని విధంగా ఘోరంగా ఫెయిలైంది. అతడు నటన నుండి వైదొలిగే దశలో ఉన్నాడని అందరూ అనుకుంటున్న సమయంలో క్రిస్మస్ 2024 వారాంతంలో ఒక చిత్రంతో తన పునరాగమనాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారతదేశంలోని ప్రముఖ స్టూడియో జియో స్టూడియోస్‌తో అమీర్ ఖాన్ మల్టీ మూవీ డీల్ ఇప్పుడు మరో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. రాజ్‌కుమార్ సంతోషి -ఉజ్వల్ నికమ్ బయోపిక్ కూడా ఈ డీల్ లో ఒక భాగం అని తెలిసింది.
నిజానికి అమీర్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రూపొందించడానికి చాలా కష్టపడుతున్నాడు. అతని నటనకు పునరాగమనం చిత్రం సోనీ పిక్చర్ ప్రొడక్షన్, ఛాంపియన్స్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. RS ప్రస్సన దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిస్మస్ బరిలో ఈ చిత్రం విడుదలవుతుంది. తదుపరి జియో స్టూడియోస్ తో అమీర్ భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
"ఛాంపియన్స్ రీమేక్ చిత్రీకరణను ముగించిన తర్వాత, రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అమీర్ నటించనున్నాడు. రాజ్ కుమార్ సంతోషి చిత్రాన్ని జియో స్టూడియోతో కలిసి అమీర్ స్వయంగా నిర్మిస్తారు. దినేష్ విజన్ - జియో స్టూడియోస్‌తో కలిసి ఉజ్జ్వల్ నికమ్ బయోపిక్‌ని కూడా అమీర్ నిర్మిస్తున్నాడు. అతను జియోతో కొన్ని ఇతర ప్రాజెక్ట్‌ల గురించి కూడా చర్చిస్తున్నాడు" అని సోర్స్ తెలిపింది. అమీర్ ఉజ్వల్ నికమ్ బయోపిక్‌లో నటిస్తాడా లేదా నిర్మిస్తాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అమీర్ కి ఇవన్నీ ఓపెన్ ఆఫర్స్. ఉజ్వల్ నికమ్ బయోపిక్‌లో నటుడిగా అతని ప్రమేయం ఎంత అతడు నటిస్తాడా లేదా? అన్నదానికి త్వరలో స్పష్ఠత రానుందని కూడా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం నిర్మాత భాగస్వామిగా జియో స్టూడియోస్‌కు కట్టుబడి ఉండాలి. అమీర్ వీటితో పాటు మరిన్ని చిత్రాలను జియో స్టూడియోస్ తో కలిసి నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు. దీని విలువ సుమారు 1000 కోట్లు ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమీర్ ఖాన్ 2024 క్రిస్మస్ వారాంతంలో ఛాంపియన్స్ రీమేక్ తో అభిమానులను అలరిస్తాడు. రాజ్‌కుమార్ సంతోషి తదుపరి చిత్రం 2025లో విడుదలవుతుంది. ఒకటి సోనీ నిర్మిస్తే.. మరొక చిత్రాన్ని జియో స్టూడియోస్ నిర్మిస్తుంది.