హీరో కుమార్తె రియ‌ల్లీ గ్రేట్ అనిపిస్తోందిగా!

కాల క్ర‌మంలో కొన్ని ర‌కాల ప‌రిస్థితులు మ‌రింత డిప్రెష‌న్ కి గురి చేసాయి

Update: 2023-08-17 07:28 GMT

అమీర్ ఖాన్ కి కుమార్తె ఇరాఖాన్ అంటే ఎంతో ఇష్టం. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో మొద‌టి భార్య‌తో విడాకులు తీసుకున్నా! అప్పుడ‌ప్పుడు పిల్ల‌ల భ‌విష్య‌త్ ని దృష్టిలో పెట్టుకుని క‌ల‌వ‌డం...పిల్ల‌ల‌తో విదేశాల‌కు వెకేష‌న్ కి వెళ్ల‌డం వంటివి చేస్తుంటారు. ఆ ర‌కంగా తండ్రి బాధ్య‌త‌ల్ని అమీర్ ఎప్పుడు మ‌రువ‌లేదు. పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం అన్ని ర‌కాల ఏర్పాట్లు ముందే చేసి పెట్టారు. ఇరాఖాన్ కోరుకున్న‌ట్లు ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహం చేయ‌బోతున్నారు.

పిల్ల‌లు పెరిగి పెద్దైన త‌ర్వాత ఎలాంటి ఇబ్బంద‌లుండ‌వు. కానీ ఎదిగే క్ర‌మంలో త‌ల్లిదండ్రులు విడిపోయి..ఎవ‌రికి వారు దూర‌మైతే ఆ ప‌రిస్థితి ఎలా ఉంటుందో? అనుభ‌వించిన పిల్ల‌లకే తెలుస్తుంది. ఆ ప‌రిస్థితిని ఇరాఖాన్ కూడా చూసింది. త‌ల్లిదండ్రులిద్ద‌రు విడిపోయిన స‌మ‌యంలో మానిస‌కంగా ఎంత‌గా కృంగిపోయిందో తాజాగా వెల్ల‌డించింది.

మా కుటుంంలో ఇలాంటి మాన‌సిక రుగ్మ‌త‌లున్నాయి. 12వ ఏట స్కూల్లో ఉన్న‌ప్పుడే డిప్రెష‌న్ సూచ‌న‌లు క‌నిపించాయి . కానీ అప్పుడు గుర్తించ‌లేదు. కాల క్ర‌మంలో కొన్ని ర‌కాల ప‌రిస్థితులు మ‌రింత డిప్రెష‌న్ కి గురి చేసాయి. ప్ర‌స్తుతం వాటి నుంచి పూర్తిగా కోలుకున్నాను. నాలా మాన‌సిక ఇబ్బందులు గుర‌య్యే వారి కోసం స్వ‌యంగా అగ‌త్సు అనే పౌండేష‌న్ కూడా ఏర్పాటు చేసాను' అని అన్నారు.

ఈ పౌండేష‌న్ లో సేవ‌లు చాలా చౌక‌గా ల‌భిస్తున్నాయి. 50 రూపాయ‌ల నుంచి 750 ల‌వ‌ర‌కూ ఫీజ్ ఉంటుంది. ఇక్క‌డికి మ‌నసిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎవ‌రైనా వెళ్లొచ్చు. బ‌స్తీల్లో జీవించే వారు కూడా అందులో క‌మ్యూనిటీ సెంట‌ర్ లో వైద్య స‌హాయం పొంద‌వ‌చ్చు. ఇక్క‌డ మొత్తం న‌లుగురు సైకియాట్రి స్టులు ఉంటారు. అలాగే బాంద్రాలో డోర్ టూ డోర్ తిరిగి మాన‌సిక స‌మ‌స్యలున్న వారిని గుర్తించి వైద్యం స‌హాయం అందిస్తున్నారు. ఈ ప‌నుల‌న్నింటిని ఇరాఖాన్ స్వ‌యంగా దగ్గ‌రుండి చూసుకుంటుందిట‌. శ‌రీరానికే కాదు..మ‌న‌సుకు గాయాల‌వుతాయి. వాటిని గుర్తించి వైద్యం అందించ‌డ‌మే త‌మ నినాదంగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News