అమీర్ ఖాన్ క్రేజీ కాంబో.. గేట్ రెడీ
ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
లాల్ సింగ్ చద్దా మూవీతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న అమీర్ ఖాన్ కొద్దిరోజులు నిరాశలో ఉన్నారు. ఎంతో ఇష్టంతో ఆ సినిమాని సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే నిర్మించారు. అయితే ఊహించని రిజల్ట్ ఆ మూవీకి వచ్చింది. దీంతో సినిమాలకి కొంతకాలం విరామం ఇచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు.
ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కూడా అమీర్ ఖాన్ సొంతం ప్రొడక్షన్ లోనే తెరకెక్కనుండటం విశేషం. రాజ్ కుమార్ సంతోషితో రెండు సినిమాలు చేయడానికి అమీర్ ఖాన్ ఒప్పందం చేసుకున్నారంట. అందులో మొదటి సినిమాని వచ్చే ఏడాది జనవరిలో మొదలు పెట్టబోతున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది డిసెంబర్ 20కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారంట. క్రిస్మస్ సీజన్ తనకి బాగా కలిసిరావడంతో అదే టైం నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు. రాజ్ కుమార్ సంతోషితో అమీర్ ఖాన్ చివరిగా 30 ఏళ్ళ క్రితం అందాజ్ అపనా అపనా అనే మూవీ చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా మరో హీరోగా నటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రాజ్ కుమార్ సంతోషి చెప్పిన రెండు కథలు నచ్చడంతో బ్యాక్ టూ బ్యాక్ చేయడానికి అమీర్ ఖాన్ సిద్ధమైపోయారు. ఇక సంతోషితో రెండో సినిమాని 2025లో పట్టాలు ఎక్కించనున్నారంట. లాల్ సింగ్ చద్దా లాంటి డిజాస్టర్ తర్వాత టైం గ్యాప్ తీసుకొని అమీర్ ఖాన్ మరింత ఉత్సాహంతో ఈ మూవీ చేయబోతున్నారు. ఎలాంటి జోనర్ కథని నెక్స్ట్ మూవీ కోసం ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది.
ఈ చిత్రంలో మిగిలిన క్యాస్టింగ్ అండ్ క్రూ గురించి త్వరలో పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ మూవీ నిర్మాణంలో జియో స్టూడియోస్ కూడా భాగస్వామ్యం కాబోతుందంట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగానే దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.