అల్లు శిరీష్ 'బడ్డీ'.. ఆ పిల్ల కనులే!
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్ కు ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్.. ఆచితూచి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం 'ఊర్వశివో రాక్షసివో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్ కు ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. కమర్షియల్ గా కూడా పెద్దగా ఆడలేదు. ఆ మూవీ తర్వాత అల్లు శిరీష్ హీరోగా 'బడ్డీ' చిత్రాన్ని అనౌన్స్ చేసి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
కానీ ఆ సినిమా నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఆ మూవీ అసలు ఉందా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు ఆడియన్స్. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన 'బడ్డీ' మూవీ.. అనేక కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చి.. మూవీ ఉందని సినీ ప్రియులు అందరికీ మేకర్స్ గుర్తుచేశారు.
తాజాగా 'బడ్డీ' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' ను బుధవారం ఉదయం రిలీజ్ చేశారు మేకర్స్. పెప్పీ మ్యూజిక్ తో ట్రెండీ స్టార్ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే, మైకంలో తేలే మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో' అంటూ సాగుతున్న ఈ మెలోడీ లవ్ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
లిరికల్ సాంగ్ లోని విజువల్స్ బాగున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. మ్యూజిక్ ఫ్రెష్ గా ఉందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఈ సాంగ్ ను హిప్ హాప్ తమిజా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించారు. హిప్ హాప్ తమిజాతో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. 'బడ్డీ'లో అల్లు శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.