ఐశ్వర్యారాయ్ లెగసీని ముందుకు నడిపిస్తుందా?
ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుమార్తె ఆరాధ్య బచ్చన్ సమక్షంలో జరుపుకున్నారు. ఐష్‌ను సత్కరించే కార్యక్రమంలో ఆరాధ్యతో పాటు, ఐష్ మాతృమూర్తి పాల్గొన్నారు.
ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుమార్తె ఆరాధ్య బచ్చన్ సమక్షంలో జరుపుకున్నారు. ఐష్‌ను సత్కరించే కార్యక్రమంలో ఆరాధ్యతో పాటు, ఐష్ మాతృమూర్తి పాల్గొన్నారు. సియోన్‌లోని జిఎస్‌బి సేవా మండల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ని సత్కరించడమే కాకుండా, తన పాత జ్ఞాపకాలతో నిండిన ఒక ఫలకం, ఫ్రేమ్‌తో ఉన్న ఫోటోను కూడా బహుమతిగా ఇచ్చారు. ఐశ్వర్యారాయ్ తనపై కురిపించిన ప్రేమ, అభిమానానికి పొంగిపోయింది. అయితే, నెటిజన్ల నుండి ఎక్కువ దృష్టిని ఆకర్షించిన విషయం ఐష్ నటవారసురాలు ఆరాధ్య. తన స్పీచ్ హృదయాన్ని కదిలించింది.
వేదికపై తన తల్లిపై ఆరాధ్య ప్రశంసల వర్షం కురిపించింది. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టించుకునే మంచి మనిషి అంటూ ఐష్ ని చిన్నారి ఆరాధ్య ప్రశంసించింది. తన తల్లి నుండి ఎలాంటి విషయాలు నేర్చుకుందో తెలిపింది. టీనేజర్ ఆరాధ్య మాటతీరు, ఉపయోగించిన పదజాలం చూసి నెటిజనులు విస్మయానికి గురయ్యారు. చాలా మంది ఆరాధ్య చాలా అనర్గళంగా మాట్లాడుతోందని ప్రశంసించగా, మరికొందరు ఐశ్వర్య - అభిషేక్ బచ్చన్ ఆమెను పరిణతి చెందిన అమ్మాయిగా పెంచారని ప్రశంసించారు. వ్యాఖ్యల విభాగంలో ఒకరు ఇలా రాసారు. కుమార్తె విశ్వాసాన్ని పెంపొందించే పదబంధాన్ని ఒక తల్లి ప్రయత్నమిదని అర్థమవుతోంది. ఈ క్షణం ఆ తల్లికి చాలా ఆనందకరం అని రాసారు. మరొకరు ఇలా రాసారు. ఆరాధ్య తన తండ్రిలా ఉంది అని వ్యాఖ్యానించారు. "అంత పరిణతి చెందినది. బాగా మాట్లాడుతుంది. ఆమె తల్లిలాగే అనిపిస్తుంది" అని ఒకరు అన్నారు. కాజోల్ కుమార్తె, ఇతర స్టార్ పిల్లల కంటే చాలా బాగా మాట్లాడగలదు! అని మరొకరు వ్యాఖ్యానించారు.
చాలామంది ఐశ్వర్యారాయ్ లెగసీని ముందుకు తీసుకెళ్లే అందమైన, తెలివైన అమ్మాయి ఆరాధ్య అంటూ కీర్తించారు. ఐశ్వర్యారాయ్ వారసురాలు అందాల పోటీలకు వెళ్లాలని భారతదేశానికి కీర్తిని అందించాలని కొందరు ఆకాంక్షించారు. అలాగే తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అద్భుత నటి అవ్వాలని కూడా దీవించారు. అయితే ఐశ్వర్యారాయ్ వారసురాలిగా ఆరాధ్య ఒత్తిడికి గురి కాకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు. ఆరాధ్య ఇంకా స్కూల్ కి వెళ్లే వయసులో ఉంది. అయినా తన పరిణతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 12 ఏళ్ల ఆరాధ్య ధీరూభాయి అంబానీ స్కూల్ లో చదువుకుంటోంది. ఐష్- అభిషేక్ పెంపకంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
2007లో ఐష్-అభిషేక్ వివాహం జరిగింది. 2011లో వారి కుమార్తె ఆరాధ్యకు స్వాగతం పలికారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే ఐశ్వర్య రాయ్ బచ్చన్ చివరిసారిగా పాన్-ఇండియన్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ 2లో కనిపించింది. ఇది పొన్నియన్ సెల్వన్ 1కి సీక్వెల్. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, విక్రమ్, కార్తీ తదితరులు నటించారు. నందిని అనే పాత్రలో ఐశ్వర్యారాయ్ అద్భుతంగా నటించారు. తన లుక్ మేకోవర్ కూడా ఆకట్టుకుంది.