ఆయ్ ట్రైలర్: అల్లరి స్నేహితులకు ప్రేమతో ఓ ట్విస్ట్

టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన గీత ఆర్ట్స్ ఇప్పుడు చిన్న సినిమాలను GA2 పిక్చర్స్‌ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే

Update: 2024-08-05 07:45 GMT

టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన గీత ఆర్ట్స్ ఇప్పుడు చిన్న సినిమాలను GA2 పిక్చర్స్‌ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ తదుపరి చిత్రంగా "ఆయ్" (AAY) ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సాగే కథతో కూడిన ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో, యంగ్ టాలెంట్స్ నార్నే నితిన్ (MAD ఫేమ్) మరియు నయన్ సరికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ తోనే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక ఫైనల్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. పిఠాపురంలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్ మంచి ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ గమనిస్తే, ఒక చిన్న గోదావరి గ్రామంలో ఉండే ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే హాస్యభరిత సన్నివేశాలతో నిండి ఉంది. కర్తీక్ (నార్నే నితిన్), రాజ్‌కుమార్ (కాసిరెడ్డి), హరి (అంకిత్ కొయ్య) అనే ముగ్గురు మిత్రులు "టార్చ్ బివేర్ గ్యాంగ్" గా కొనసాగుతూ ఉంటారు. వీరంతా ఎప్పుడూ ఏదో ఒక పిచ్చి పనిలో తలమునకలై ఉంటారు.

ట్రైలర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు వీరి సరదా సన్నివేశాలు వినోదభరితంగా ఉన్నాయి. వీరి స్నేహం, అనుబంధం ప్రేక్షకులకు చిరునవ్వులు పుట్టించేలా ఉంది. ఇదే సమయంలో కార్తీక్ ఒక అందరికంటే భిన్నంగా ఉండే పల్లవి (నయన్ సరికా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నార్నే నితిన్, నయన్ సరికా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. వారి సన్నివేశాలు హాస్యాస్పదంగాను అలాగే చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి.

కానీ ఈ ప్రేమకథకు ఒక ట్విస్ట్ ఉంది. కార్తీక్ పల్లవిని ప్రేమిస్తే ఈ ముగ్గురు స్నేహితుల మధ్య ఏం జరుగుతుంది? కర్తీక్ తన ప్రేమ కోసం ఎలాంటి కృషి చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు ఆగాల్సిందే. ట్రైలర్‌లో చూపించిన సరదా డైలాగులు, హాస్యసన్నివేశాలు సినిమాలో బాగానే నవ్వించనున్నాయని అర్ధమవుతుంది.

స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ అనే అంశాలను ఒకే కథలో చూపిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు మేకర్స్ ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఈ చిత్రంలో వినోదం, డ్రామా, భావోద్వేగాలు సమపాళ్లలో ఉన్నాయని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నూతన దర్శకుడు అంజి క మణిపుత్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Full View
Tags:    

Similar News