భార్య కంటే త‌క్కువ పారితోషికం.. అడిగితే ఫీలైన హీరో?

కాలంతో పాటే మార్పు రావాల‌ని ప‌లువ‌రు క‌థానాయిక‌లు కోరుకున్నారు.

Update: 2024-11-01 23:30 GMT

మేల్ ఫీమేల్ లింగ అస‌మాన‌త‌.. పే పారిటీ గురించి చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది. స్టార్ హీరోల‌తో పోలిస్తే స్టార్ హీరోయిన్ల‌కు వ‌చ్చే పారితోషికం చాలా త‌క్కువ‌. ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు బ‌హిరంగంగా దీనిని విమ‌ర్శించారు. కాలంతో పాటే మార్పు రావాల‌ని ప‌లువ‌రు క‌థానాయిక‌లు కోరుకున్నారు. అదంతా స‌రే కానీ.. భార్య భ‌ర్త ఒకే ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తూ పారితోషికాల్లో హెచ్చు త‌గ్గులు ఉన్న‌ప్పుడు ప‌రిస్థితేమిటీ? అంటే.. అభిషేక్ - ఐశ్వ‌ర్యారాయ్ జంట‌నే నేటిత‌రం ఆద‌ర్శంగా తీసుకోవాలి.


అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ గతంలో తమ వైవాహిక జీవితంలో స‌రిగ‌మ‌ల గురించి.. కెరీర్ ప్ర‌యాణం గురించి చాలా నిజాయితీగా ఉన్నారు. ఇంటర్వ్యూలలో ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం చూసి చాలా రోజులైంది. కొంత కాలంగా వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ పారితోషికంలో సమానత్వం అనే ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాడు. ఆ సమయంలో అభిషేక్ తాము కలిసి ప‌ని చేసిన 8-9 సినిమాలలో తన భార్య తన కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకున్నార‌ని వెల్లడించాడు.

జాతీయ మీడియా క‌థ‌నం ప్ర‌కారం... 2018లో జరిగిన ఒక ఈవెంట్‌లో దర్శకుడు షూజిత్ సిర్కార్ చిత్ర పరిశ్రమలో లింగ అసమానత గురించి అభిషేక్ బచ్చన్‌ను అడిగారు. ఆ సమయంలో అభిషేక్ మ‌నం దృక్పథాన్ని క‌లిగి ఉండాల‌ని అనుకుంటాను అని అన్నారు. నా జీవితంలో ఇద్దరు మహిళలు, తన తల్లి జయ బచ్చన్.. భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్.. వారి స్వీయ‌ నిబంధనల ప్రకారం పరిశ్రమలో పనిచేశారని అభిషేక్ వెల్లడించారు. వారు కోరుకోనిది చేయమని ఎవ‌రూ బ‌ల‌వంతం చేయలేదని అభిషేక్ చెప్పాడు. ఐశ్వ‌ర్యారాయ్ ఇటీవ‌ల పొన్నియ‌న సెల్వ‌న్ లాంటి భారీ హిట్ చిత్రంలో న‌టించింది. అభిషేక్ బ‌చ్చ‌న్ కొన్ని క్లాసిక్ హిట్స్ లో న‌టించాడు. ఇటీవ‌ల ఈ జంట ప‌బ్లిక్ లో విడివిడిగా క‌నిపించ‌డంతో విడాకులు తీసుకుంటున్నార‌న్న ప్ర‌చారం సాగింది. కానీ దానిని ఆ ఇద్ద‌రూ ధృవీక‌రించ‌లేదు.

Tags:    

Similar News