నిజంగానే పొట్ట పెంచిన హీరో..ఇప్పుడెలా ఉన్నాడంటే?
బాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా అంటూ టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తుంటే? అభిషేక్ మాత్రం అలాంటి ప్రయత్నాలకు దూరంగానే ఉన్నాడు.
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ వారసుడికి విజయం దరిదాపుల్లో కూడా కనిపించలేదు. డాడ్ అమితాబచ్చన్ 82 ఏళ్ల వయసులోనూ చించేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన `కల్కి 2898` యాక్షన్ సన్నివేశాల్లో ఏ రేంజ్ లో నటించారో తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియాలో మంచి విజయం అందుకుంది. కానీ సన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
బాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా అంటూ టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తుంటే? అభిషేక్ మాత్రం అలాంటి ప్రయత్నాలకు దూరంగానే ఉన్నాడు. బాలీవుడ్ లో వచ్చిన సినిమాలు చేసుకుంటూ కెరీర్ బండిని ముందుకు తీసుకెళ్తున్నాడు. తాజాగా సుజిత్ సర్కార్ దర్శకత్వంలో `ఐ వాంట్ టు టాక్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అభిషేక్ బచ్చన్ డిఫరెంట్ రోల్ పోషిస్తున్నాడు.
ఇప్పటికే ఎత్తైన పోట్టతో ఉన్న ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటి జనులు ఈసారి అభిషేక్ రొటీన్ కి భిన్నమైన కంటెంట్ తోనే వస్తున్నాడు? అనే చర్చ సాగుతుంది. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ పొట్ట సీక్రెట్ రివీల్ చేసాడు. `ఈ పాత్ర కోసం ఎంతో బరువు పెరిగాను. పొట్టతో కనిపిస్తాను. ప్రోస్తటిక్ మ్యాకప్ సహాయంతో అలా కనిపించానని అందరూ అనుకుంటున్నారు.
కానీ అందులో నిజం లేదు. మ్యాకప్ సాయం లేకుండా ఎంతో శ్రమించి పొట్ట పెంచాను. బరువు పెరిగాను. కానీ ఇకపై ఏ సినిమా కోసం బరువు పెరగ కూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ వయసులో బరువు తగ్గడం చాలా కష్టమైన పని. తగ్గే క్రమంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉన్న బరువును పెరగకుండా..తగ్గకుండా ఉంటే చాలు` అన్నాడు.