స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ పార్టీలో భ‌ర్త మిస్సింగ్ కార‌ణం?

అయితే ఈ పార్టీలో అభిషేక్ బ‌చ్చ‌న్ మిస్స‌వ్వ‌డం రెడ్డిట‌ర్ల‌లో సందేహాల‌కు తావిచ్చింది.

Update: 2024-10-23 16:24 GMT

ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ మ‌ధ్య ఏదో జరుగుతోంద‌ని రెడ్డిట‌ర్లు డేగ కన్ను వేసారు. ఆ ఇద్ద‌రూ విడిపోతున్నారంటూ ఓ వైపు పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఐశ్వ‌ర్యారాయ్ గ‌త‌ మంగళవారం రాత్రి తన కుటుంబంతో గడుపుతూ కనిపించింది. ఐశ్వ‌ర్య రాయ్, తన కుమార్తె ఆరాధ్య బచ్చన్, తల్లి బృందారాయ్‌తో కలిసి క‌జిన్ పుట్టినరోజు పార్టీలో కనిపించింది. ఐష్ ఇంట్లో జ‌రిగిన పార్టీ ఇది. అయితే ఈ పార్టీలో అభిషేక్ బ‌చ్చ‌న్ మిస్స‌వ్వ‌డం రెడ్డిట‌ర్ల‌లో సందేహాల‌కు తావిచ్చింది.


ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక ఫోటోలో ఐశ్వర్య తన కూతురితో కలిసి పోజులిచ్చింది. ఈ పార్టీలో ఆరాధ్య తన స్కూల్ జెర్సీలో కనిపించింది. ఈ ఫోటోను పుట్టినరోజు జరుపుకుంటున్న ఐశ్వర్య కజిన్ షేర్ చేసారు. ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తన స్నేహితులు, అనుచరులకు ఐష్‌ ధన్యవాదాలు తెలిపింది. పార్టీని హోస్ట్ చేసినందుకు ఐషూ త‌న‌ కుటుంబాన్ని ప్రశంసించారు. యాధృచ్ఛికంగా అభిషేక్ బ‌చ్చ‌న్ `హౌస్‌ఫుల్ 5` షూట్ షెడ్యూల్ పూర్త‌యాక‌ సోమవారం ముంబైకి తిరిగి వచ్చాడు. అతడు ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. కానీ పార్టీకి అటెండ్ కాలేదు.

ఐశ్వర్యరాయ్ `విడాకుల` గురించి చాలా నెలలుగా పుకార్లు వచ్చాయి. అభిషేక్ - ఐశ్వర్య వివాహం జరిగి ఇప్పటికి 17 సంవత్సరాలు. ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్.. అభిషేక్ ఇంత‌కుముందు అంబానీ పెళ్లికి విడిగా వెళ్ల‌డం కూడా చాలా సందేహాల‌ను రాజేసింది. ఆ పెళ్లిలోనే కాదు, ఇటీవ‌ల ఎక్క‌డ క‌నిపించినా త‌న కుమార్తె ఆరాధ్య‌తో త‌ప్ప ఇంకెవ‌రితోను ఐష్ క‌నిపించ‌డం లేదు. ఇది రెడ్డిట‌ర్ల‌లో చాలా డౌట్లు పెట్టేస్తోంది.

ఇటీవ‌ల SIIMA అవార్డులకు ఐష్ - ఆరాధ్య క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ వేడుకలో ఐష్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. ఆరాధ్య ఐష్‌ను ఉత్సాహపరుస్తుండగా.. బచ్చన్ కుటుంబ సభ్యులు ఎవరూ సోషల్ మీడియాలో అయినా క‌నీస మాత్రంగా కోడ‌లి విజయంపై స్పందించలేదు. ఇది అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. బాలీవుడ్ మీడియా సోర్స్ ప్ర‌కారం.. ఐశ్వ‌ర్యారాయ్ కి ఆడ‌ప‌డుచు అయిన శ్వేతానందా బ‌చ్చ‌న్ తో వ్య‌క్తిగ‌తంగా పంతాలు ప‌ట్టింపులు ఉన్నాయి. అత్త‌మ్మ‌ జ‌యా బ‌చ్చ‌న్ కూతురికి అండ‌. దీంతో భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్‌ తో వేరు కాపురం పెట్టాల‌ని ఐశ్వ‌ర్యారాయ్ పోరింది. ఇది చాలా ఇత‌ర కుటుంబాల్లో ఉండే స‌మ‌స్య‌లానే ఉంది. కానీ ఇప్పుడు అభిషేక్ నుంచి ఐశ్వ‌ర్యారాయ్ విడిపోతోంది అన్న ప్ర‌చారాన్ని అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

Tags:    

Similar News