డెవిల్.. ఆ దర్శకుడిని అందుకే తప్పించారట
కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరపైకి రాబోతున్న యాక్షన్ స్పై ఫిలిం డెవిల్ మెల్లమెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటుంది
కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరపైకి రాబోతున్న యాక్షన్ స్పై ఫిలిం డెవిల్ మెల్లమెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటుంది. మొదట ఈ సినిమా ఫస్ట్ లుక్కుతోనే క్యూరియసిటీ క్రియేట్ చేసుకుంది. అయితే సినిమా డైరెక్టర్ ను తప్పించడంతో కూడా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. మొదట డెవిల్ సినిమాకు నవీన్ మేడారం అనే యువ దర్శకుడిని సెలెక్ట్ చేసిన నిర్మాత ఆ తర్వాత అతన్ని తీసేసి తన పేరుని డైరెక్టర్ గా వేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే ఈ విషయంలో ఎన్ని రకాల గాసిప్స్ వస్తున్న కూడా మొదట చిత్ర యూనిట్ పెద్దగా స్పందించలేదు. ఇక సినిమా ఈవారం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత ఎట్టకేలకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొదట ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో హీరో కళ్యాణ్ రామ్ ను అడగగా ఒక విషయం గురించి మాత్రం తనను అడగవద్దు అని పూర్తిగా అది నిర్మాత నిర్ణయం అని, ఆయననే అడగాలి అని కళ్యాణ్ రామ్ సున్నితంగా ఆ ప్రశ్నను తిరస్కరించాడు.
అయితే నిర్మాత అభిషేక్ నామా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ మేడారం గురించి ప్రస్తావించాడు. అతన్నీ తప్పించడానికి కారణం ఉంది అని ఒక దర్శకుడిని మొదట సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్లీ తీసివేయడం అంటే చిన్న విషయం కాదు, అందరి నిర్ణయం తీసుకున్న తర్వాతనే దర్శకత్వ బాధ్యతలు తాను తీసుకున్నట్లుగా అభిషేక్ తెలియజేశాడు.
ఇది చాలా పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా, పెద్ద ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏ పత్రం పొరపాటు జరిగిన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో అతను హ్యాండిల్ చేయలేడు అనిపించింది. అందుకే చాలా రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే అతడిని తప్పించినట్లు అభిషేక్ తెలియజేశారు. అయితే మొదట నవీన్ తన ప్రొడక్షన్లోనే ఒక సినిమా కూడా చేశాడు అని పిలిచి మరియు అవకాశం ఇచ్చారు అని అన్నారు.
కానీ డెవిల్ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పిన అభిషేక్ తన దర్శకత్వంలో సినిమా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందని నమ్ముతున్నట్లుగా తెలియజేశాడు. ఈ సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుకుంటుంది అంటూ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా వివరణ ఇచ్చాడు.